YCP : వైసీపీ ప్లీనరీ రెండో రోజు.. యెల్లో మీడియాకే కేటాయించిన వైనం.!

NQ Staff - July 9, 2022 / 05:30 PM IST

YCP : వైసీపీ ప్లీనరీ రెండో రోజు.. యెల్లో మీడియాకే కేటాయించిన వైనం.!

YCP : టీడీపీ మహానాడు జరుగుతున్నప్పుడు.. అహో మహానాడు.. ఒహో మహానాడు.. అంటూ కీర్తించిన టీడీపీ అనుకూల మీడియా, మరీ చీపుగా వైసీపీ ప్లీనరీ సమావేశాల సమయంలో భోజనాల దగ్గర తలెత్తిన చిన్నపాటి గందరగోళాన్ని కూడా హైలైట్ చేసిన విషయం విదితమే.

The second day Plenary Meeting Reserved For Yellow Media by YCP

The second day Plenary Meeting Reserved For Yellow Media by YCP

వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేసిన వైనాన్నీ టీడీపీ అనుకూల మీడియా మరీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో, రెండో రోజు ప్లీనరీ సమావేశాన్ని పూర్తిగా టీడీపీ అనుకూల మీడియా.. అదే, యెల్లో మీడియా కోసం వైసీపీ కేటాయించినట్లు కనిపిస్తోంది.

స్పీకర్ సహా.. అందరిదీ అదే తీరు..

The second day Plenary Meeting Reserved For Yellow Media by YCP

The second day Plenary Meeting Reserved For Yellow Media by YCP

ప్లీనరీ సమావేశాలకు స్పీకర్ హాజరు కావడమేంటి.? అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రావడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ మహానాడులో అప్పటి స్పీకర్ హాజరయ్యారు కదా.? అంటూ తమ్మినేని మండిపడ్డారు.

మరోపక్క, కొడాలి నాని అయితే టీడీపీ అనుకూల మీడియాని ఓ ఉతుకు ఉతికేశారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా, టీడీపీ అనుకూల మీడియానే టార్గెట్‌గా చేసుకున్నారు. ‘దుష్టచతుష్టయం.. యెల్లో మీడియా..’ అంటూ విమర్శించడమే కాక, నేరుగా రామోజీరావు తదితరుల పేర్లనూ ప్రస్తావించి మరీ ఏకి పారేశారు వైసీపీ నేతలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us