Atchannaidu: అచ్చెన్నా మౌనం వెనుక అసలు రహస్యం.. ఇంత కుట్ర దాగి ఉందా ?

Atchannaidu టీడీపీ పార్టీలో నెంబర్ 2 స్థానం ఎవరిదీ అంటే అచ్చెన్నాయుడుదే అని చెప్పాలి. చంద్రబాబు తర్వాత పార్టీ తరుపున స్వరం ఎక్కువ వినిపించే నేతగా ఆయనకు పేరు ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు సత్తా ఏమిటో మనం చూశాం. అలాంటి నేతకు బాబు కూడా మంచి పదవే ఇచ్చాడు. అయితే ఆ పదవి పుణ్యమా లేక మరేదైనా విషయమో కానీ అచ్చెన్నా మాత్రం గతం మాదిరి పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా లేరనే మాటలు వినిపిస్తున్నాయి.

achennayudu tdp

ఉత్తరాంధ్ర లో టీడీపీ కి బలమైన కుటుంబం ఏమిటయ్యా అంటే అది కింజరాపు కుటుంబం అనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో రాష్ట్రము మొత్తం జగన్ దెబ్బకు టీడీపీ కకావికలం అయిన కానీ, తమ కుటుంబం నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎంపీగా పార్టీ పరువును నిలబెట్టారు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చ ఆ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏమిటో, అలాంటి ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీకి కొంచం దూరమైంది అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీలో నిరంతరం సమస్యలపై పోరాడలేక పక్కకు తప్పుకుంటున్నారు. టిడిపి కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు అచ్చెన్నాయుడు. అచ్చాన్నాయుడు కుమార్తె అదిరెడ్డి భవానీ ఇప్పుడు టిడిపిలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే. పార్లమెంట్ లో టీడీపీ వాయిస్ వినిపించే రామ్మోహన్ కూడా ఇదే ఫ్యామిలీకి చెందిన వాడు. అయినప్పటికీ టిడిపి అనుకూల మీడియా ఆయనను విస్మరిస్తోంది. వాస్తవానికి పార్టీ ఇటీవలి సంస్థాగత ఎన్నికల్లో తేలిపోయింది. అచ్చెన్నాయుడు సిఫారసు చేసిన పేర్లన్నీ డస్ట్బిన్కు చేరాయి. అధిష్టానం వేరే వారికి టికెట్లు ఇచ్చింది. .

ఒక పథకం ప్రకారమే టీడీపీ అనుకూల మీడియా కింజరాపు కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని తెలుస్తుంది. రామ్మోహన్ నాయుడు రాజకీయంగా లోకేష్ కంటే ఒక మెట్టు పైన ఉండే నేత. రామ్మోహన్ నాయుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన భాష పంచులు ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా ఉంటాయి. పార్లమెంటులో హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలో ఆయన చేసిన ప్రసంగాలు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. . రామ్మోహన్ నాయుడుకు కవరేజ్ ఇవ్వడం వల్ల పార్టీలో నారా లోకేష్ బాబు స్థానానికి అపాయం కలుగుతుందని టిడిపి అనుకూల మీడియా అచ్చెన్నాయుడు ఫ్యామిలీని దూరం పెడుతోందని సమాచారం. ఇవన్నీ తెలిసే అచ్చెన్న కూడా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి

Advertisement