వెంకటకృష్ణ సెలవు వెనుక అసలు కారణాలు ?

ABN లో వెంకటకృష్ణ డిబేట్స్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే, అలాంటి వెంకట కృష్ణ ఇప్పుడు ABN నుండి బయటకు వచ్చినట్లు లేదు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు వెంకటకృష్ణ ఉద్యోగం పోయిందనేది ఇక్కడ చర్చనీయాంశం. దీనికి ఆ ఛానెల్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లోనే ఆసక్తికర సమాధానాలు దొరుకుతున్నాయి.

venkata krishna

బ్లాక్ మెయిల్ కి సంబంధించిన ఒక విషయం మీదే వెంకట కృష్ణ ను బయటకు పంపినట్లు తెలుస్తుంది. ఒక నేతకు చెందిన వార్తను తొక్కిపట్టినందుకు దాదాపు 50 లక్షలు డిమాండ్ చేయటంతో, దానికి సంబంధించిన ఆధారాలను రాధాకృష్ణ కు అందివ్వటంతో వెంకట కృష్ణ ఉద్యోగం పోయిందని చాలా మంది అంటున్నారు. నిజానికి వెంకట కృష్ణ మీద ఇది వరకే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈటీవీ -2 టివీ 5, 6 చానెల్స్ లో చేసే సమయంలో పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణలు వచ్చాయి.

ఇక వెంకట కృష్ణ నిర్వహిస్తున్న డిబేట్ లో జరిగిన చెప్పుదెబ్బ విషయం కూడా అతని మెడ మీద కత్తి లాగా వేలాడుతుంది. బీజేపీ కార్యకర్త మీద ఈ దాడి జరగటంతో రాధాకృష్ణ మీద ఒత్తిడి పెరిగిపోయింది. అది కూడా ఒక కారణం కావచ్చు. ఇక తనపై వస్తున్నా వార్తల గురించి స్పందిస్తూ “ఒక ప్రయాణం.. ఎన్నో మజిలీలు, సవాళ్లు వుంటాయి..ప్రస్తుతానికైతే సెలవు మాత్రమే.. అంతకు మించి ఏమైనా వుంటే త్వరలో నేనే చెప్తా.” అంటూ ట్వీట్ చేశారు. కొందరు శునకానందంతో ట్రోల్స్ చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారు.

వెంకట కృష్ణ ABN నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు అని తెలియగానే, అటు జనసైనికులు, ఇటు వైసీపీ నేతలు ఎవరికీ తగ్గట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు… వన్ కు అన్యాయం చేసిన వాళ్లకు ఎవరికైనా ఇదే గతి పడుతుందని జనసేన కార్యకర్తలు ఆత్మసంతృప్తి పొందితే.. జగన్ కు వ్యతిరేకంగా ఇన్నాళ్లూ చేసిన అసత్య ప్రచారానికి ప్రతిఫలమే ఇదంటూ వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి సెలవ మీద వెళ్లిన వెంకట కృష్ణ ఈ విషయంపై రాధాకృష్ణ తో చర్చలు జరిపే అవకాశం ఉంది. “కుదిరితే” తిరిగి డిబేట్ సీట్ లో కూర్చోవచ్చు, లేకపోతే అటు నుండి అటు వెళ్లిపోవచ్చు అని తెలుస్తుంది.

Advertisement