Sajjala Ramakrishna Reddy : రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. ఉమ్మడి రాష్ట్రంగా చేయాలి
NQ Staff - December 8, 2022 / 02:37 PM IST

Sajjala Ramakrishna Reddy : రాష్ట్ర విభజన పై సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన చేసిన తీరు పై కోర్టులో కేసులు వేసాం. విభజనకు వ్యతిరేకం గా కోర్టు లో మా వాదనలను బలంగా వినిపిస్తాం.
మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రంగా చేస్తే ముందుగా స్వాగతించేది మా పార్టీనే అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుండి ఆందోళనలు చేసింది వైకాపానే. రాష్ట్ర విభజన వెనక్కి తిప్పాలి లేదంటే సరిదిద్దుకోవాలంటూ కోరుతున్నాం.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుండి పోరాడుతున్నాం. తాము కచ్చితంగా రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్నాం.. కుదిరితే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నదే మా విధానం అంటూ ఆయన పేర్కొన్నారు.
త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి రాష్ట్రం సమైక్య రాష్ట్రం అంటూ రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు రాజకీయ నాయకులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. అన్ని పార్టీల వారిని కూడా ఇదే విధానం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.