ఢిల్లీ పెద్దలు కదిలారు : టార్గెట్ ‘ కమ్మ ‘ మొదలెట్టారు – ఇక మాములుగా ఉండదు !

Admin - December 26, 2020 / 07:00 PM IST

ఢిల్లీ పెద్దలు కదిలారు : టార్గెట్ ‘ కమ్మ ‘ మొదలెట్టారు – ఇక మాములుగా ఉండదు !

ఏపీలో కమ్మ సామజిక వర్గానికి చెందిన వారిని తక్కువ చేస్తున్నారని ఆయా వర్గానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే జగన్ అధికారం చేపట్టినప్పటినుండి కమ్మలకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఇస్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా మాటల యుద్ధం చేస్తుంది వైసీపీ. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టి ఆయనపై విమర్శలు కురిపించింది ఏపీ సర్కార్. ఇక ఎట్టకేలకు ఈ ఎన్నికలు వాయిదా పడిన కూడా విమర్శలు కురిపించడం మాత్రం ఆపడం లేదు.

ap bjp 1

 

దీనితో కమ్మ సామజిక వర్గానికి చెందిన ప్రజలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇకపోతే తాజాగా కమ్మ వర్గానికి చెందిన మీడియా సంస్థలను కూడా టార్గెట్ చేస్తూ వత్తిడిలు తీసుకొస్తున్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్న కమ్మ సామజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తుంది వైసీపీ సర్కార్. ఇక ఈ విషయంపై కేంద్ర బీజేపీ దృష్టి పెట్టిందట. అయితే రాష్ట్రంలో ఉన్న కమ్మలు వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉన్నారని కొత్త ప్లాన్ కు బీజేపీ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అయితే కమ్మ వర్గానికి చెందిన ఓ మీడియా సంస్థతో బీజేపీ కీలక నేత బెంగుళూర్ లో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో ఉన్న కమ్మ సామజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకుల వివరాలు కావాలని అడిగినట్లు తెలుస్తుంది. అలాగే కమ్మలు ఎక్కువగా నివసించే ఉభయ గోదావరి, కృష్ణా, అనంతపురం, గుంటూరు ప్రాంతాల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తల వివరాలు కూడా కావాలని అడిగినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే ఏపీలో బీజేపీ బలపడటానికి గట్టిగానే ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి కమ్మ వర్గానికి వేస్తున్న గాళం ఎంతవరకు పనిచేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీ వేస్తున్న ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీకి ఇబ్బందులు ఎదురు అవడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us