ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ జరిగిపోయాయి. ఇక రెండో విడత నామినేషన్స్ పక్రియ కూడా మొదలైంది. ఇక రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాయలసీమ జిల్లా అయిన అనంతపురంలో రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక పంచాయితీలో సర్పంచ్ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసి సర్పంచ్ పదవికి పోటీ చేయకూడదని బెదిరించి కొట్టిన విషయం తెల్సిందే. ఈ ఘటన మినహా, అంతకు మించి ఏమీ జరగలేదనే చెప్పాలి.
మరోపక్క స్థానిక ఎన్నికల నిర్వహణపై కంటే కూడా ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసే లేఖలపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఏ లేఖ రాస్తారో అని ఎదురుచూస్తున్నారు. రోజుకు ఎదో ఒక లేఖ రాయటం, కోర్టు కు వెళ్ళటం లాంటివి చేస్తున్నాడు. ఇక రెండో దశ నామినేషన్స్ స్టార్ట్ కావటంతో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దీనితో ఆ ప్రాంతంలో పోలీసుల హడావిడి ఎక్కువైపోయింది. అక్కడి స్థానిక ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా దగ్గరుండి భద్రతా పరమైన చర్యలను తీసుకుంటున్నారు. నామినేషన్ సమయంలో ఎటువంటి వివాదాలు జరగకుండా ముందస్తుగానే అన్ని చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా రాప్తాడు ఎంపిడివో మరియు ఎమ్ఆర్వో కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.
ఇక నామినేషన్స్ స్వీకరించే కార్యాలయాల వద్ద ఎటువంటి వాహనాలను అనుమతించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎవరి వాహనమైన సరే నామినేషన్ కేంద్రానికి కనీసం 100 మీటర్ల దూరంలో పెట్టే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా వివాదాలు జరిగే ప్రతి ఒక్క అవకాశాన్ని పోలీసులు తమ నియంత్రణలో ఉంచుకుంటున్నారు. ఈ నామినేషన్ నిర్వహించడం పోలీసు వారికి ఎంతో సవాలుతో కూడుకున్న పని. ఎస్పీ సత్య యేసు బాబు చెబుతున్న ప్రకారం వివాదాలు సృష్టించే ఏ పార్టీ నాయకుడు అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడము అని చెప్పారు.