Telangana Minister Harish Rao : వైసీపీని హరీష్ రావు ఎందుకు కెలికినట్టు.?

NQ Staff - September 30, 2022 / 05:15 PM IST

Telangana Minister Harish Rao : వైసీపీని హరీష్ రావు ఎందుకు కెలికినట్టు.?

Telangana Minister Harish Rao : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ మీద తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అడపా దడపా సెటైర్లు వేస్తూ వస్తోంది. మొన్నామధ్య తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంపై పెద్ద దుమారమే చెలరేగింది.

ఆ తర్వాత ‘బ్రదర్ జగన్..’ అంటూ, ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద అమితమైన అభిమానాన్ని ప్రదర్శించారు కేటీయార్.

తాజాగా, తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఏపీలో వైసీపీ పాలన మీద సెటైర్లేశారు. విద్యుత్ సరిగ్గా వుండడంలేదనీ, ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే, అరెస్టులు చేసి జైళ్ళలో పెడుతున్నారనీ హరీష్ రావు తాజాగా చేసిన ఆరోపణలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.

ఎందుకు కెలుకుతున్నారబ్బా.?

ఏపీలో వైసీపీని కెలకడం వల్ల తెలంగాణలో గులాబీ పార్టీకి లాభమేమీ లేదు. పైగా, నష్టం వాటిల్లుతుంది కూడా. అయితే, తెలంగాణలో వైసీపీ మద్దతుదారులంతా ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు వెళ్ళిపోయారు. సో, వాళ్ళ ఓట్లతో లాభం లేదని టీఆర్ఎస్ అనుకుంటుండొచ్చు.

మరి, ‘బ్రదర్ జగన్..’ అంటూ కేటీయార్ ఎందుకు చెబుతున్నట్లు.? అయినా, పొరుగు రాష్ట్రంలో సమస్యలపై తెలంగాణలోని అధికార పార్టీకి ఎందుకు.? వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇమేజ్ తెలంగాణలో పెరుగుతుండడం వల్లే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆందోళన పెరిగిందనీ, ఈ కారణంగానే పుట్టుకొచ్చిన అసహనం నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయనీ అనుకోవ్చేమో.

కానీ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్, అందర్నీ కలుపుకుపోయేలా వుండాలి. హరీష్ రావుని కేసీయార్ కట్టడి చేయగలరా.? అన్నదే ప్రస్తుతానికి ఆసక్తికరమైన టాపిక్.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us