Telangana : తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నవారు ఇప్పుడెక్కడ కేటీయారూ.?

NQ Staff - September 30, 2022 / 07:06 PM IST

Telangana  : తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నవారు ఇప్పుడెక్కడ కేటీయారూ.?

Telangana  : ఓ ప్రశ్న వేస్తే, దానికి సమాధానం రావడం కాదు, అంతకు మించిన ఘాటైన ప్రశ్న ఎదురొస్తుంటుంది రాజకీయాల్లో. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. మిలియన్ మార్చ్ సహా అనేక కార్యక్రమాలు తెలంగాణ సమాజంలో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చాయి స్వరాష్ట్రం దిశగా.

ఎన్నో ప్రాణత్యాగాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. అయితే, ఆ బలిదానాలకు తెలంగాణలో విలువ లేకుండా పోయిందన్న ఆవేదన కూడా లేకపోలేదు.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఓ దశలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ చేజారిపోయింది తెలంగాణ ఉద్యమం.

గట్టిగా నిలబడిన తెలంగాణ జేఏసీ

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చాలా గట్టిగా నిలబడ్డారు. కేసీయార్ సైతం ఆయన్ని పక్కన పెట్టేసినా,, ఆయన ముందడుగు వేశారు. అలా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచి, అధికార పీఠమెక్కింది.

ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, అప్పట్లో బండి సంజయ్ ఎక్కడ.? రేవంత్ రెడ్డి ఎక్కడ.? షర్మిల ఎక్కడ.? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వాళ్ళందరూ ఎక్కడున్నారన్నది అప్రస్తుతం.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన కోదండరామ్ ఎక్కడ.? మీ ప్రభుత్వంలో ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారున్నారు.? అని ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి కేటీయార్‌పైకి దూసుకొస్తున్నాయ్.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us