Bandi Sanjay దేవీ నవరాత్రులు: దీక్ష చేపట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

NQ Staff - September 24, 2022 / 09:05 AM IST

160363Bandi Sanjay దేవీ నవరాత్రులు: దీక్ష చేపట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay : దేవీ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దీక్షలు చేస్తుంటారు. భవానీ దీక్షలు ధరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దీక్షలు తీసుకుని, అక్కడే ఆ దీక్షల్ని ముగిస్తుంటారు కూడా నవరాత్రుల అనంతరం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దేవీ నవరాత్రుల నేపథ్యంలో దీక్ష తీసుకున్నారు.

Telangana BJP Bandi Sanjay Take Devi Mala

Telangana BJP Bandi Sanjay Take Devi Mala

కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్, అక్కడే మహాశక్తి దేవస్థానంలో దీక్ష తీసుకున్నారు పండితుల సమక్షంలో. నాలుగో విడత పాద యాత్ర ముగింపు.. ఐదో విడత పాదయాత్ర అతి త్వరలో.. ఇటీవల నాలుగో విడత పాదయాత్రను బండి సంజయ్ ముగించిన సంగతి తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్ర అనేక నియోజకవర్గాల మీదుగా సాగింది.

కాగా, త్వరలో ఐదో విడత పాదయాత్ర చేపట్టనున్నారు బండి సంజయ్. అది కూడా దసరా పండగ తర్వాత ప్రారంభం కానుంది. పాదయాత్రకీ పాదయాత్రకీ మధ్య విరామ సమయంలో దసరా నవరాత్రుల నేపథ్యంలో బండి సంజయ్ ఈ దీక్ష చేపట్టడం జరిగింది. తెలంగాణ సుభిక్షంగా వుండాలని ఆకాంక్షిస్తూ దీక్ష చేపట్టినట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.