Modi: ప్రధానికి వంద రూపాయలు పంపి గడ్డం గీయించుకోమన్న టీస్టాల్ వ్యక్తి

Modi: సెలెబ్రిటీస్ ఎవరైనా క్రేజ్ ఎంత ఉంటుందో.. షాకింగ్ ఎక్స్ పీరియన్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. అయితే ఇలాంటి షాకింగ్ సీన్లు కేవలం సినీ సెలెబ్రిటీస్ విషయంలోనే జరుగుతాయనుకుంటారు చాలామంది. కానీ పొలిటిషియన్స్ విషయంలో కూడా అప్పుడప్పుడు షాక్స్ తగులుతూనే ఉంటాయి. రీసెంట్ గా మహారాష్ట్ర, బారామతికి చెందిన టీ అమ్మే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వంద రూపాయలు పంపారు.

Tea Vendor Sends Rs.100 to PM Modi to Get his Beard Shaved
Tea Vendor Sends Rs.100 to PM Modi to Get his Beard Shaved

దాంతోపాటు ఓ లెటర్ ని కూడా పంపారు. ఆ లేఖలో గడ్డం గీసుకోమంటూ సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుండి దేశమంతా కరోనాతో తల్లడిల్లుతున్నారు. ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అసంఘటిత కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బారామతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే అనే వ్యక్తి, ప్రధాని నరేంద్ర మోదీకి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

భారత ప్రధాని మోదీ గడ్డం పెంచుతున్నారని, భవిష్యత్ లో ఏదైనా పెంచాలనుకుంటే, అది భారతదేశ ప్రజలకు ఉపాధిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ జనాభాకు వీలైనంత వరకు టీకాలు వేసేలా, వైద్య సదుపాయాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది వలస కార్మికులు, స్థానిక కార్మికులకు కలిగిన నష్టాల నుండి, వారి బాధల నుండి గట్టెక్కించడంపై ప్రధాని ఇకనైనా కాస్త దృష్టి పెట్టాలని ఆ లెటర్ లో అనిల్ మోరే వ్యక్తం చేశారు.

తనకు మన దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం అని.. అందుకే తన సేవింగ్స్ లో నుండి 100 రూపాయలు పంపుతున్నాను.. ఆ డబ్బుతో దయచేసి ప్రధాని గడ్డం చేయించుకోవాలని కోరారు. పైగా నరేంద్ర మోదీ దేశానికే అత్యున్నత, అగ్ర నాయకుడు.

ఆయన్ను అవమానించాలని గానీ, బాధపెట్టాలని తన ఉద్ధేశ్యం కాదని దయచేసి తన ఆలోచనను అర్థం చేసుకోవాలని కోరారు. మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న ఆవేదన తమకు తెలియాలని అనుకున్నారు. ఆయన తన విన్నపాన్ని మన్నించాలనే ఉద్దేశ్యంతోనే ఈ లేఖ పంపానని అనిల్ మోరే తెలిపారు.