Elections: టీడీపీ, వైసీపీ లీకుుల.. జనసేన పార్టీకి 50 సీట్లు.!

NQ Staff - May 10, 2022 / 10:57 AM IST

Elections: టీడీపీ, వైసీపీ లీకుుల.. జనసేన పార్టీకి 50 సీట్లు.!

Elections: 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి తామే వస్తామని చెబుతోంది. మిత్రపక్షం బీజేపీతో కలిసి అధికార పీఠమెక్కుతామని జనసేన చెబుతోంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనీ, జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ కూడా చెబుతోంది.

TDP YCP Fight for Upcoming Elections

TDP YCP Fight for Upcoming Elections


కానీ, అంతలోనే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి దగ్గరబోతోందన్న సంకేతాల్ని బీజేపీ కూడా పంపిస్తోంది. అదే జరిగితే, తాము జనసేనకు దూరం జరుగుతామని బీజేపీ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంతకీ, 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుంది.? ఈ విషయమై ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇటు టీడీపీ, అటు వైసీపీ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి దక్కే సీట్లపైనా టీడీపీ, వైసీపీ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి.

మొత్తంగా 45 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు దక్కుతాయట. ఆరు లోక్ సభ స్థానాల్లోనూ జనసేన పోటీ చేసే అవకాశం వుందట. అలాగని టీడీపీ ఓ లిస్టు తయారు చేసిందంటూ, టీడీపీ మద్దతుదారులతోపాటు, వైసీపీ మద్దతుదారులూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండడం గమనార్హం.

అయితే, జనసేన వాదన ఇంకోలా వుంది. 125కి పైగా స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోందనీ, పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బీజేపీకి ఇస్తామనీ జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీతో పొత్తు వుండదనీ, ఒకవేళ టీడీపీ గనుక తమతో కలిసి పోటీ చేయాలనుకుంటే, ఆ పార్టీకి కూడా ఎన్నో కొన్ని సీట్లు తామే ఇస్తామని జనసేన చెబుతుండడం ఆసక్తికరమైన విషయమిక్కడ.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us