ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్

Admin - December 2, 2020 / 12:06 PM IST

ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ వాకౌట్

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక మొదటి రోజు నుండే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇక మొదటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా పదమూడు మంది టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసారు. ఇక నిన్న రెండవ రోజు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సస్పెండ్ కాగా, ఇక చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో సీఎం జగన్ విమర్శలు చేసాడు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశం హాట్ హాట్ గా సాగుతుంది.

అయితే ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు కోరారు. కానీ ఈ అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కు అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుండి టీడీపీ సభ్యులు వాకౌట్ చేసారు. దీనితో అసెంబ్లీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మొదటి రోజు నుండి ఏపీ అసెంబ్లీ ఇలానే హాట్ హాట్ గా కొనసాగుతుంది. కాగా మొత్తం ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండగా, ఇప్పటికే రెండు రోజులు పూర్తి అయ్యాయి. ఇక నేటితో కలిపి మొత్తం మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us