Chandrababu Naidu : జనసేన నేతల అరెస్టుని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు.!
NQ Staff - October 16, 2022 / 04:15 PM IST

Chandrababu Naidu : అసలే తెలుగుదేశం పార్టీకి తొత్తులా జనసేన పార్టీ వ్యవహరిస్తోందన్న విమర్శలు అధికార వైసీపీ నుంచి అడ్డగోలుగా వస్తున్నాయ్.! ఈ తరుణంలో జనసేనను మరింత ఇరకాటంలో పెట్టే ఉద్దేశ్యం కాకపోతే, జనసేన నేతల అరెస్టుని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించడమేంటి.?
గతంలో కూడా టీడీపీపై దాడుల్ని జనసేన అధినేత ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు వుండకూడదన్నది అప్పట్లో జనసేనాని స్పందన తాలూకు సారాంశం. బహుశా ఆనాటి పవన్ కళ్యాణ్ స్పందనకి, చంద్రబాబు ఇలా రుణం తీర్చుకుంటున్నారని అనుకోవాలేమో.
తీవ్రంగా ఖండిస్తున్నా..
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసేశారు. ర్యాలీకి అనుమతి కోరిన నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లలు చంద్రబాబు ట్వీటేశారు.
అంతే కాదు, జనసేన నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల్నీ చంద్రబాబు తప్పు పట్టేశారు. ఈ ట్వీటు వల్ల జనసేనకు ఒరిగేదేమీ లేదు. వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే, జనసేన పార్టీకే నష్టం జరుగుతోంది.
చంద్రబాబు స్పందన పట్టుకుని, ‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్’ అని వైసీపీ ఇంకాస్త గట్టిగా తిట్టడానికి చంద్రబాబే అవకాశం కల్పించారు. బహుశా ఆయన ఉద్దేశ్యం కూడా అదేనేమో.!