చంద్రబాబు చేసిన పనికి సంతోషించాలో – బాధపడాలో అర్ధం కావట్లేదు తెలుగు తమ్ముళ్ళకి !

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా వరకు నిరసించిపోయాడనే చెప్పాలి. పెద్దగా ప్రజల మధ్యకు వచ్చిన సందర్భాలు కూడా తక్కువే, అలాంటి సమయంలో కరోనా రావటంతో ఇక పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిపోయి, జూమ్ కాల్స్ లో రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎన్ని కామెంట్స్ చేసిన కానీ, బాబు మాత్రం జూమ్ లోనే ఉండటానికి ఇష్టపడ్డాడు, బహుశా వయస్సు రీత్యా వస్తున్నా అనేక సమస్యలు కూడా కారణం కావచ్చు, అలాంటి చంద్రబాబు నాయుడు తాజాగా బయటకు వచ్చి హల్చల్ చేశాడు.

nara chandrababu naidu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరై బాబు సృష్టించిన సునామి మాములుగా లేదు. గతంలో చంద్రబాబును ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాబు అసెంబ్లీ లో వీరంగమే సృష్టించాడు, అయితే బాబులో ఈ మార్పు చూసిన తెలుగు తమ్ములు సంతోష పడాలో లేక బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు.

చాన్నాళ్ల తర్వాత చంద్రబాబు బైటకొచ్చారు. రోడ్డెక్కారు, వరి కంకులు పట్టుకుని ధర్నా చేశారు, అయితే రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు ముందే ప్రతిపక్షము ప్రజల తరుపున పోరాటం చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది, నివర్ తుఫాన్ తగ్గి రోజులు గడుస్తుంది, తుఫాన్ వలన దెబ్బతిన్న ప్రాంతాలను సీఎం జగన్ స్వయంగా ఏరియల్ సర్వే చేశాడు , తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 500 రూపాయలు విడుదల చేయాలనీ చెప్పాడు, తుఫాన్ వలన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయటానికి కమిటీని నియమించాడు, ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే నష్ట పోయిన రైతులకు పరిహారం అందించే విధంగా చర్యలు చేపడుతున్నాడు.

గతంలో ఎప్పుడు కూడా జూమ్ వదిలిపెట్టి బయటకు రాను చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా బాబుకి రైతులపై ప్రేమ ఇప్పుడే ఎందుకు పొంగుకొచ్చిందయ్యా అంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, వాటికీ హాజరుకావాలి కనుక, ప్రజా సమస్యలు ఎదో ఒకటి ఉండాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు రైతుల విషయాన్నీ ఎత్తుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

Advertisement