AP Employees: ది పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ !!

AP Employees (ప్రభుత్వ ఉద్యోగులు): తాజాగా సుప్రీంకోర్టు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఎవరైతే ఎన్నికల నిర్వాహణకు సహాయం చేయడానికి అంగీకరించరో వారందరినీ బదిలీ చేయాలని నిమ్మగడ్డ సిఫార్సు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంది ప్రభుత్వ అధికారులను బదిలీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ను, ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని సోమవారం రోజు జగన్ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది.

Supreme Court Stong Comments on AP Employees ప్రభుత్వ ఉద్యోగులు
Supreme Court Stong Comments on AP Employees

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు అన్ని సహకారాలు అందిస్తామని ప్రకటించారు. దీనితో నిన్నటి వరకు ఎన్నికల నిర్వహణకు తీవ్ర విముఖత చూపిన ఉద్యోగస్తులు ఇరకాటం లో పడిపోయారు. జగన్ సర్కార్ అప్పటికప్పుడు మాట మార్చడంతో ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు అని రాజకీయ నేతలు ఏపీ ఉద్యోగస్తులను ఎద్దేవా చేస్తున్నారు.

రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగులు బలి

నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువరిస్తూ ఉద్యోగస్తులకు చివాట్లు పెట్టింది. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగస్తుల యొక్క దూకుడుతనానికి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. దీనితో పొలిటికల్ పార్టీలు ఆడే గేమ్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఏపీ ఉద్యోగస్థులకు తెలిసి వచ్చినట్లయింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయస్థానాలు కలిసి ఐకమత్యంగా పని చేస్తేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ గర్వాల కు పోయి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలకు సరైన పరిపాలన అందదు. ఏ ఉద్యోగి అయినా సరే రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అలా కాదని పొలిటికల్ పార్టీలకు వత్తాసు పలుకుతూ పనిచేస్తే.. నష్టపోవడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకే పార్టీ ఎల్లప్పుడూ ప్రభుత్వంలో ఉండటం అసాధ్యం. అలాంటప్పుడు ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇతర పార్టీలకు పక్షపాతం గా వ్యవహరిస్తే ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుందో ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలని కూడా చాలామంది సూచిస్తున్నారు.

Advertisement