Sonu sood: చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించిన సోనూసూద్

Sonu sood: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతాయో ఊహించలేం. లేటెస్ట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును, ఆయన భార్యను కుటుంబాన్ని దూషించారని ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి ఘటనతో టీడీపీ నేతలు సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

TheNewsQube-
sonusood calls CBN
sonusood calls CBN

తన పార్టీ నేతలకు ఏ చిన్న కష్టం వచ్చినా.. తట్టుకోలేని చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని అన్నారనే క్రమంలో తీవ్ర మనోవేధనకు గురయ్యారు. ఇక వైసీపీ నేతలపై, జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. చంద్రబాబును ఏడ్పించారని, వాళ్ళ అంతు చూస్తామంటూ శపథాలు చేశారు. ఇదే క్రమంలో చంద్రబాబునాయుడు తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ఛాలెంజ్ చేశారు.

ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు టీడీపీ నేతలు, అభిమానులే కాకుండా సెలెబ్రిటీలు కూడా ఫోన్లు చేసిన పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ కోలీవుడ్ సూపన్ స్టార్ అయిన రజనీకాంత్ ఫోన్ చేసి మాట్లాడారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న రజనీకాంత్ ఫోన్ లో బాధపడ్డారు.

అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. 1984 నుండి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలున్నాయని, ఆయన కుమార్తెపై ఇలాంటి దూషణలు రావడం నిజంగా బాధాకరం అని అన్నారు. టాలీవుడ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటుగా మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా చంద్రబాబుకు మద్దుతు ప్రకటించారు.

sonusood calls CBN1
sonusood calls CBN1

ఇదే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మాట్లాడుతూ.. దేవాలయంలాంటి సభలో ఇలాంటి వైఖరి సరికాదని అన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూ తెలిపారు.