Sonia Gandhi : షాకింగ్: మళ్ళీ కోవిడ్ బారిన పడ్డ సోనియా గాంధీ.!
NQ Staff - August 14, 2022 / 09:54 AM IST

Sonia Gandhi : ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోమారు కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో బాడపడుతున్నారనీ, హోం ఐసోలేషన్‌లో వున్నారనీ చెప్పారు జైరాం రమేష్.

Sonia GAndhi tests positive for covid again
ఇటీవల సోనియా కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.
మూడు నెలల్లో రెండో సారి.!
సోనియా గాంధీ కోవిడ్ బారిన పడటం మూడు నెలల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. జూన్‌లో ఆమె కోవిడ్ బారిన పడ్డారు. లక్షణాల తీవ్రత కాస్త ఎక్కువ వుండడంతో ఆమె ఆసుపత్రిలో కూడా చేరారు. ఈ సమయంలోనే, ఈడీ విచారణ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
కోవిడ్ నుంచి కోలుకుని, ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత సోనియా గాంధీ, ఈడీ విచారణకు హాజరయ్యారు కూడా. ఇంతలోనే మళ్ళీ మరోమారు సోనియా గాంధీ కోవిడ్ బారిన పడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సాధారణంగా కోవిడ్ సోకితే, తద్వారా వచ్చే ఇమ్యూనిటీ కారణంగా వెంటనే కోవిడ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా వుంటాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిడ్ బారిన పడటం, ఆమెకు వృద్ధాప్యం కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు వుండడంతో.. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.