Vaccine: ఎంపీ, సినీన‌టిని వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించిన కేటుగాడు

Vaccine: కేటుగాళ్ల ఆగ‌డాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఛాన్స్ దొరికితే అవ‌త‌లి వారిని బురిడీ కొట్టించేందుకు రెడీగా ఉంటున్నారు. ఒక‌ప్పుడు సామాన్యులని మోసం చేస్తూ వ‌చ్చిన నకిలీ గాళ్లు ఇప్పుడు సెల‌బ్రిటీల‌ను సైతం ఈజీగా బోల్తా కొట్టిస్తున్నారు. రీసెంట్‌గా నిర్మాత సురేష్ బాబు విష‌యంలో ఏం జ‌రిగిందో మ‌నం చూశాం. వ్యాక్సిన్ డ్రైవ్ అంటూ ల‌క్ష రూపాయ‌ల‌ని అవ‌లీల‌గా దోచుకున్నాడు. ఆ త‌ర్వాత అరెస్ట్ కూడా అయ్యాడ‌నుకోండి.

Vaccine

ఇక ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి.. న‌కిలీ మ‌నిషి విష‌యంలో బోల్తా ప‌డింది. తాను ఐఏఎస్ అంటూ టీకా వేయించాడ‌ని మిమి పోలీసుల‌కి తెలియ‌జేసింది. మిమి చక్రవర్తి జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. మోడల్, యాక్టర్‌గా రాణిస్తున్న మిమి రాజకీయాల్లోనూ సత్తా చాటారు.

ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొన్న మిమి చక్రవర్తి 2011లో బెంగాల్ సినీ, టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్ర‌స్తుతం ఎంపీగా కొన‌సాగుతున్న మిమి చ‌క్ర‌వ‌ర్తిని ఓ వ్య‌క్తి తాను ఐఏఎస్ అని చెప్పి, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమం నిర్వ‌హిస్తున్నాం. దానికి మీ స‌హ‌కారం కావాల‌ని కోరాడంటూ మిమి చ‌క్ర‌వ‌ర్తి పేర్కొంది.

Vaccine

అత‌ను ఐఏఎస్ అని నేను న‌మ్మ‌డానికి కార‌ణం అత‌ని చుట్టూ కొంద‌రు అధికారులు, భ‌ద్ర‌తా సిబ్బంది లాంటి వారున్నారు. దీంతో అత‌ను నిజంగానే ఐఏఎస్ అనుకోని టీకా వేయించుకున్నాను. టీకా వేయించుకున్నాక ఎంత సేప‌టికి కొవిన్ నుంచి ధ్రువీకరణ సందేశం రాలేదు. వెంటనే కోల్‌కతా పోలీసులను సంప్రదించాను” అని అన్నారు మిమి చ‌క్ర‌వ‌ర్తి.

మిమి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పోలీసులు పట్టుకొని అతడి వద్ద నుంచి కారుకు ఉపయోగించిన నకిలీ స్టిక్కర్లు, నీలిరంగు బేకాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం కేటుగాడిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.