Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ దగ్గ‌ర ఉద్రిక్త‌త‌.. ప‌లు రైళ్లు నిలిపివేత‌, ఆర్టీసీ బ‌స్సులు ధ్వంసం

NQ Staff - June 17, 2022 / 11:29 AM IST

Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ దగ్గ‌ర ఉద్రిక్త‌త‌.. ప‌లు రైళ్లు నిలిపివేత‌, ఆర్టీసీ బ‌స్సులు ధ్వంసం

Railway Station : అగ్నిపథ్‌ ఆందోళన మెల్ల‌మెల్ల‌గా హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అగ్నిప‌థ్ ఎఫెక్ట్..

ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లి అక్కడ ఉన్న పార్శల్ బస్తాలను తీసుకొచ్చి పట్టాలపై అడ్డుగా పడేశారు.. వాటిని తగులబెట్టే ప్రయత్నం చేశారు. అలాగే రాళ్లు రువ్వారు.. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్లాట్ ఫామ్‌ మీద ఉన్న స్టాల్స్‌ను కూడా ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా రెండు బోగీలకు నిప్పు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు.

Situation Secunderabad Railway Station Tense

Situation Secunderabad Railway Station Tense

దీంతో ఆందోళన కారులు మరింత రెచ్చిపోయారు. ఫైర్ ఇంజిన్లపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్లాట్ ఫామ్ నంబర్ 1,2,3లు రణరంగాన్ని తలపించాయి. రైల్వే ట్రాక్ పై ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. సేవ్ ఆర్మీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. పలు చోట్ల పట్టాల మధ్య నిప్పు పెట్టారు. రైలు ముందు కదలకుండా అడ్డుకున్నారు. దీంతో పలు రైళ్లను నిలిపివేశారు.

ఆందోళనతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. రైల్వే స్టేషన్ బయట ఉన్న పలు బస్సులను కూడా ధ్వంసం చేశారు విద్యార్థులు. మెరుపు ధర్నాతో రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని పథ్ రద్దు చేసి ఆర్బీ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని వీరు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Situation Secunderabad Railway Station Tense

Situation Secunderabad Railway Station Tense

అగ్ని పథ్ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని యువకులు ఆందోళనలు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో యువకులు రైల్వే స్టేషన్‌లలోకి చొచ్చకెళ్లారు.. అక్కడ నిరసనలు చేశారు. బీహార్‌లో అయితే రైలు బోగీకి నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూడా ఈ నిరసన సెగ తగలడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us