తెలంగాణలో షర్మిల ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేసుకుందా..? మారుతున్నా సమీకరణాలు

ys sharmila
ys sharmila

తెలంగాణలో సరికొత్త పార్టీ పెట్టాలని ఆలోచనలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల అందుకు సంబంధించిన పనులన్నీ వేగంగా చక్కబెడుతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 9 న లోటస్ పాంటు వేదికగా తెలంగాణ లో రాజన్న రాజ్యం ఎందుకు ఉండకూడదు అంటూ ప్రశ్నించి సంచలనం రేపిన షర్మిల వరస పెట్టి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం అవుతూ భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది.

ys sharmila

తెలంగాణలో పార్టీపెట్టి ఎదగాలంటే అందుకు అనుసరించవలసిన వ్యూహాలు గురించి కూడా ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో డిఫెరెంట్ స్ట్రాటజీతో ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల ముందుకెళుతోంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా ఆమె రాజకీయం సాగుతోంది. కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో ముందుకెళ్లాలంటే ప్రధానంగా తాను తెలంగాణ కోసం పాటు పడుతున్నట్టు ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహాలు పన్నుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ప్రత్యామ్నాయ నాయకురాలిగా తనను తాను నిరూపించుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. .మద్దతుదారుల సమావేశంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తన పార్టీ ప్రధానంగా టీఆర్ఎస్ టార్గెట్ గా ఎలా ముందుకు సాగాలనే దానిపైనే షర్మిల తన మనస్సులోని ఆలోచనను పంచుకున్నట్టు సమాచారం.

“ రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ కావాలనుకుంటే మీకు పోలిక అవసరం. వైయస్ఆర్ తెలంగాణకు చేసినదానిని కేసీఆర్ ఇప్పుడు చేయడం లేదని నిరూపించడం అవసరం. ఇప్పుడు చేస్తున్న దానితో పోల్చగలిగితే, ప్రజలు తేడాను అర్థం చేసుకుంటారు. మా వైపు మొగ్గు చూపవచ్చు ”అని షర్మిల పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 2008 లో 1,250 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్‌ఆర్ చేపట్టిన హైదరాబాద్‌లో భూగర్భ పారుదల వ్యవస్థను మెరుగుపరిచే ప్రాజెక్టును టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, నిధులను మళ్లించారని షర్మిలా ఆరోపించారు. బదులుగా టిఆర్ఎస్ నాయకులు నీటి కాలువలను ఆక్రమించారని.. హైదరాబాద్ మునగడానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు..

“మేము రాజన్న రాజ్యం మరియు కేసిఆర్ రాజ్యం మధ్య వ్యత్యాసాన్ని చూపించాల్సిన అవసరం ఉంది” అని ఆమె చెప్పారు.“వైయస్ఆర్ ముస్లింల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ కోటాను ప్రవేశపెట్టగా, కేసీఆర్ ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు. వైయస్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసి ప్రాంతీయ రింగ్ రోడ్ కోసం ఆమోదాలు పొందగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా దానిని చేపట్టలేదు, ”అని కేసీఆర్ పాలనా వైఫల్యాలను షర్మిల ఎండగట్టారు. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని ఆమె ముందుకు సాగే ఆలోచనలో ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది.

Advertisement