సుప్రీం కోర్ట్ లో సీఎం జగన్ కు ఊరట

ఏపీ సీఎం జగన్ ను తొలగించాలని సుప్రీం కోర్ట్ లో వేసిన పిటిషన్ పై కోర్ట్ స్పందించింది. అయితే ఈ విషయంపై విచారణ జరపాలని సీఎం జగన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి కి లేఖ రాసారు. దీనితో స్పందించిన సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో విచారణ జరిపింది. ఇక ఈ విచారణలో సీఎం జగన్ ను పై వేసిన పిటిషన్ లో లేవనెత్తిన ఉండడం, అంశాలు సరిగ్గా లేకపోవడం వలన ఈ పిటిషన్లకు అర్హత లేదని స్పష్టం చేసింది. అయితే సీఎం జగన్ న్యాయస్థాన పరమైన విషయాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అందుకు గాను జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ లు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.

ఇక ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మసనం కమిటీ వేసి విచారణ జరిపింది. దీనితో పిటిషనర్లు వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. అయితే పలు పత్రికల్లో వచ్చిన అంశాల ఆధారంగా పిటిషన్లు వేయడం ఏంటని సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. అంతేకాదు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని ధర్మాసనం మండిపడింది. ఇక జగన్ పై వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసే వరకు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఒకవైపు వైసీపీ వర్గాల్లో మాత్రం కాస్త సంతృప్తిని నింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here