Sasikala : చిన్నమ్మ రీ ఎంట్రీ.. ఈ అమ్మ ఇంకా గుర్తుందా?
NQ Staff - February 25, 2023 / 05:30 PM IST

Sasikala : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బతికున్నంత కాలం శశికళ రాజ్యం తమిళనాడులో నడిచింది. జయలలిత అమ్మ అయితే, శశికళ చిన్నమ్మగా పరిపాలన కొనసాగింది. మంత్రులతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి వారి పనుల్లో కూడా చిన్నమ్మ శశికళ వేలు పెట్టేది అంటూ ఆ సమయంలో ప్రచారం జరిగింది.
ఎప్పుడైతే జయలలిత మృతి చెందారో అప్పటి నుండి అన్నాడీఎంకే లో సంక్షోభం నెలకొంది. శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న కూడా పాత కేసుల వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత శశికళ రాజకీయాలతో సందడి చేస్తుందని అంతా భావించారు కానీ ఆమె రాజకీయాల్లో కనిపించలేదు.
జయలలిత 75వ జయంతి సందర్భంగా ఒక మీడియా సంస్థకు శశికళ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా శశికళ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్క అన్నాడీఎంకే కార్యకర్తను కలుస్తాను, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను అంది.
2024 ఎన్నికల్లో అందరితో కలిసి పని చేస్తానంటూ పేర్కొంది. శశికళ మాటలను బట్టి త్వరలోనే ఆమె అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకుంటాను అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తుంది. అది ఎంత వరకు సాధ్యం, అసలు తమిళనాడు ప్రజలు ఇంకా శశికళను గుర్తు పెట్టుకుని ఉన్నారా అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.