Samantha: కేటీఆర్ పోస్ట్ షేర్ చేస్తూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన స‌మంత‌

Samantha: స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంటుంది. తాజాగా తాజాగా మంత్రి కేటీఆర్‌పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. చిన్నపిల్లలకు మరింత రక్షణ చేకూర్చేందుకు ప్ర‌భుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆప‌ద‌లో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్షక్ వాహ‌నాల‌ను ప్రారంభించారు.

samantha-tweet to-minister-ktr-post
samantha-tweet to-minister-ktr-post

జిల్లాకొక‌టి చొప్పున 33 బాల ర‌క్షక్ వాహ‌నాల‌ను ఏర్పాటు చేశారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా సదుపాయం కల్పించారు. మంత్రి సత్యవతి చేసిన ఈ పనిని మెచ్చకుంటూ కేటీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేటీఆర్ పెట్టిన పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.

33 బాల రక్షక వాహనాలు ప్రారంభమయ్యాయి అంటూ చప్పట్లు కొట్టిన ఎమోజీ పెట్టింది. సినిమాలతో బిజీ అయినా కూడా సమంత ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే విడాకుల ప్రకటన అనంతరం తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతోంది సమంత.

స్నేహితులతో సరదాగా షికార్లు కొడుతూనే తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. బలమైన కథా కథనాలున్న సినిమా ఎంపిక చేసుకుంటున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుండటం విశేషం. ఇటీవల దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది సుకుమార్ టీమ్.

sam-tweets-to-ktr post1
sam-tweets-to-ktr post1

తెలుగు, తమిళ సినిమాల్లో దూసుకుపోతూ సౌత్ క్వీన్‌గా వెలిగిపోతోంది సమంత. ఇప్పటికే తన చేతిలో తెలుగు సినిమా ‘శాకుంతలం’తో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ అవకాశాల వైపు కూడా సామ్ మొగ్గుచూపుతున్నట్టు టాక్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్న సామ్ తరువాతి అడుగు హాలీవుడ్‌లోనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.