సాగర్, తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యేది అప్పుడే.. !

by elections
by elections

తెలుగు రెండు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. తెలంగాణ లో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నిక, ఇటు ఆంధ్రలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరగాల్సి వుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తేదీ మార్ఛి 7 న విడుదల అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుండి సమాచారం వస్తుంది.

by elections

ఖాళీ అయిన ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రకారం చూసినా.. మార్చి మొదటి వారంలో ప్రక్రియ ప్రారంభిస్తే సమయానికి పూర్తవుతుంది. మార్చి ఏడో తేదీనే ఎందుకంటే… ఆ రోజున… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.

తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోం , కేరళల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. వాటితో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగవలసిన ఉప ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పర్యటనలు చేయడం ఆయన స్టైల్. ఇప్పుడు అది జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ సభలునిర్వహించాలో ..నిర్వహించేసిన తర్వాత ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఐదేళ్ల క్రితం మార్చి నాలుగో తేదీన విడుదల చేశారు.

మొన్న ఒక సమావేశంలో మోడీ మాట్లాడుతూ మార్చి ఏడవ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు అంటూ చెప్పాడు, మోడీ మాటను కాదని దాదాపుగా ఆ తేదీ మార్చటం సాధ్యం కాదు, కాబట్టి ఆ కోణంలో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా అదే రోజు విడుదల అయ్యే అవకాశం ఉండనే చెప్పాలి.

ఈ ఎన్నికల కోసం అన్ని ప్రధాన పార్టీలు సిద్ధం అయ్యాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డి సిద్ధం అయ్యాడు. తెరాస మరియు బీజేపీ తరుపున అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి టీడీపీ నుండి పనబాక లక్ష్మి ఖరారు అయ్యింది. వైసీపీ నుండి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇక బీజేపీ మరియు జనసేన నుండి ఎవరు పోటీ చేస్తారు అనేది తెలియాల్చి ఉంది.

Advertisement