Pawan kalyan : పాపం బీజేపీ.. తన పంజా పవర్ ఏమిటో చూపించిన జనసేనాని

Pawan kalyan : రాజకీయాల్లో ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ముఖ్యంగా మిత్రుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే మిత్రులు కూడా శతృవులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ విషయంలో కూడా అదే జరిగింది. ఆంధ్రాలో జనసేన-బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణ లో కూడా రెండు పార్టీలు కలిసి పొత్తు ధర్మం పాటిస్తున్నాయి.

Will janasena win in tirupati bypoll

కానీ మొన్నటి గ్రేటర్ ఎన్నికల సమయంలో కొందరు బీజేపీ నేతలు జనసేన పార్టీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మౌనం వహించిన జనసేనాని నేడు ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఓ వైపు ఎమ్మెల్సీఎన్నికల పోలింగ్ జరుగుతూండగా.. తెలంగాణ బీజేపీ నేతలకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లోఅభ్యర్థులను నిలబెట్టిన తర్వాత కూడా ఉపసంహరించుకుని మద్దతు పలికితే… తమను అమానించారని మండిపడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు వర్గీయులు షాక్ కు గురయ్యారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అభ్యర్థుల్ని ఉపసంహరించిన తర్వాత పలువురు తెలంగాణ నేతలు.. పవన్ పై తేలిక కామెంట్లు చేశారు. తాము మద్దతు అడగలేదని..పవన్ వచ్చి ఇచ్చారన్నారు. తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు లేదని తేల్చేశారు. పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో బ లమేం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నీ ఆషామాషీ నేతలన్నవి కాదు. ప్రస్తుతం తెలంగాణలో చక్రం తిప్పుతున్న బీజేపీ నేతలు చేసిన విమర్శలే. అరవింద్, డీకేఅరుణ , బండి సంజయ్ లాంటి వారందరూ తలాఓ మాట అన్నారు.

వాటికీ బదులుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలకు షాకిచ్చినట్లయింది. తెలంగాణ లో హోరాహోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా చాలా కీలకమైంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ నుండి బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు రావటమే కాకుండా తెరాస పార్టీ నిలబెట్టిన పీవీ నరసింహారావు కూతురికి ఓటు వేయాలని చెప్పటం బీజేపీకి జనసేనాని ఇచ్చిన భారీ షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట. సరిగ్గా పోలింగ్ జరుగుతున్నా సమయంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల తెలంగాణ బీజేపీ నేతలు ఫైర్ అయ్యినట్లు తెలుస్తుంది. దీనిపై కేంద్ర పెద్దలకు జనసేనాని మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement