S.Vani Devi : థ్యాంక్యూ డాడీ..

S.Vani Devi : ఇన్నాళ్లూ ఒక ఆర్టిస్టు, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక సోషల్ యాక్టివిస్ట్ అయిన ఎస్.వాణీదేవి నిన్నటి నుంచి ఒక ప్రజాప్రతినిధి కూడా. లేడీ డైనమిక్ లీడర్. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ. ఈ సెగ్మెంట్ నుంచి శాసన మండలిలోకి అడుగుపెట్టబోతున్న మొట్టమొదటి మహిళ. రాజకీయాల్లో వేసిన తొలి అడుగులోనే అద్భుతమైన విజయం సాధించిన నాయకురాలు. అసెంబ్లీ కౌన్సిల్ లో తన ప్రత్యర్థి పార్టీ బీజేపీకి స్థానమే లేకుండా చేసిన సంచలనం. సీఎం కేసీఆర్ అంచనాను, నమ్మకాన్ని నిలబెట్టిన ఆడబిడ్డ. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురే అయినా ఇప్పుడు అందరి బంధువు.

S.Vani Devi : s-vanidevi-thanks-to-all
S.Vani Devi : s-vanidevi-thanks-to-all

ఎందరో మహానుభావులు.. అందరికీ..

‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై అభిమానం, గౌరవం, నమ్మకంతో ప్రథమ, ద్వితీయ ప్రాధాన్యత ఓటేసి గెలిపించిన ఎందరో మరెందరో మహానుభావులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ విజయం కోసం క్షణక్షణం పరిశ్రమించిన, పరితపించిన టీఆరెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ మొదలుకొని ప్రతి కార్యకర్తకూ ఇది అంకితం’’ అని ఎస్.వాణీదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ ఆదివారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న తన తండ్రి పీవీ నరసింహారావు ఘాట్ ను సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. పట్టభద్రులు తనకు అప్పగించిన ఈ గురుతర బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

అది నా అదృష్టం: S.Vani Devi

‘‘పీవీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు నాకు లభిస్తున్న ఈ గుర్తింపునకు తొలి మెట్టు అదే. పీవీ కూతురిగానే ప్రజల్లోకి వెళ్లాను. ఆ విషయాన్నే గర్వంగా చెప్పుకున్నాను. అందువల్ల నా విజయంలో నాన్న గారి పాత్ర విలువ కట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో ఆయనకు సుస్థిర స్థానం ఉందనే విషయం మరోసారి రుజువైంది. నాకు మంచి పుట్టుకను ఇచ్చిన ఆ భగవంతుడికి, మా నాన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్యూ డాడీ’’ అని ఎస్.వాణీదేవి భావోద్వేగంగా స్పందించారు.

పీవీ ఫ్యామిలీ.. ఫుల్ హ్యీపీ..

ఎస్.వాణీదేవి విజయం పట్ల పీవీ ఫ్యామిలీ, బంధుమిత్రులు ఆనందం వెలిబుచ్చారు. అమెరికాలో ఉంటున్న ఆయన చిన్న కూతురు డాక్టర్ విజయ ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది మా నాయనకు దక్కిన గౌరవం’’ అని ఆమె చెప్పారు. వాణీదేవి కూతురు రజిత, అల్లుడు రాజేశ్ వద్దిరాజు, ఇతర చుట్టాలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Advertisement