Munugodu : మునుగోడులో రికార్డు స్థాయి పోలింగ్: అన్ని పార్టీలో నరాలు తెగే ఉత్కంఠ.!

NQ Staff - November 4, 2022 / 04:15 PM IST

Munugodu : మునుగోడులో రికార్డు స్థాయి పోలింగ్: అన్ని పార్టీలో నరాలు తెగే ఉత్కంఠ.!

Munugodu : ఎవరూ ఊహించని విధంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయ్యింది. 2018 సాధారణ ఎన్నికలతో పోల్చితే రెండు శాతానికి పైగా అదనంగా పోలింగ్ నమోదవడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.

2018 ఎన్నికల్లో 91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 93 శాతం పోలింగ్ నమోదయ్యింది. నిజానికి, పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి 77 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ సమయంలో పోలింగ్ కేంద్రాల్లో వున్న ఓటర్లను బట్టి చూస్తే, పోలింగ్ 95 శాతం దాటే అవకాశాలున్నాయని అంచనావేశారు.

పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలం.?

కేసీయార్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా పెద్దయెత్తున ఓట్లేశారనీ, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని బీజేపీ అంటోంది. కాగా, బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టడానికి మునుగోడు ప్రజానీకం పోలింగ్ కేంద్రాలకు పోటెట్టిందనీ, గులాబీ పార్టీకే ఓట్లు రికార్డు స్థాయిలో పడ్డాయన్నది టీఆర్ఎస్ వాదన.

కాంగ్రెస్ మాత్రం మునుగోడు పోలింగ్ విషయమై మౌనం దాల్చింది. ఏ ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాకపోవడమే అందుక్కారణం.

కాగా, ఈసారి మునుగోడు బై పోల్ ఫలితాల్ని అంచనా వేయడం చాలా చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా 2,41,805 మంది ఓటర్లు మునుగోడులో వుంటే, 2,25,192 ఓట్లు పోల్ అయ్యాయి. 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా వున్నాయి. చివరి ఏటీఎం స్ట్రాంగ్ రూమ్‌లో సీల్ చేయబడిన సమయం తెల్లవారు ఝామున 4.40 నిమిషాలుగా తెలుస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us