Rapaka Varaprasad : రాపాక వరప్రసాద్ కుమారుడి పెండ్లి పత్రికపై జగన్ ఫొటో..!
NQ Staff - May 20, 2023 / 08:48 AM IST

Rapaka Varaprasad : జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. అయితే గెలిచినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి ఆయన ఇప్పుడు వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయారు.
ఇప్పటికే వైసీపీ మీటింగ్ లకు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కుమారుడి పెండ్లి పత్రిక నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాపాక వరప్రసాద్, నాగరత్నం దంపతుల కుమారుడి పెండ్లి జూన్ 7న రాత్రి 1గంటకు జరగనుంది. అయితే ఈ పెండ్లి పత్రికపై సీఎం జగన్, భారతి ఫొటోలు ముద్రించారు వర ప్రసాద్.

Rapaka Varaprasad Son Wedding Magazine Is Going Viral
దానికి.. మాకు దైవసమానులైన జగన్, భారతమ్మ ఆశీస్సులతో అని రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు అర్థం అవుతోంది. జనసేన నుంచి గెలిచినా కూడా.. ఆయన వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులు, జగన్ పథకాలను చూసి వైసీపీలోకి వచ్చేశారు.
ఏపీని కచ్చితంగా జగన్ మాత్రమే డెవలప్ చేయగలరని నమ్ముతున్నారు రాపాక. ఇక రాబోయే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ వస్తుందని చాలామంది చెబుతున్నారు. ప్రస్తుతం రాజోలులో ఆయనకు మంచి పట్టు ఉంది. మరి ఈయన కుమారుడి పెండ్లికి జగన్ వస్తారా లేదా అనేది చూడాలి.