Raghu rama: వైసీపీ ఎమ్యేల్యే రఘురామకృష్ణరాజు కొద్ది రోజులుగా జగన్‌తో పాటు జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీ పదవికి రాజీనామా ఖాయమంటున్న రఘురామ కృష్ణరాజు దూకుడు పెంచారు. వచ్చే నెలలోనే పదవికి గుడ్ బై చెప్పి.. నర్సాపురం ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై చర్చించేందుకు చిరంజీవి తనతో పాటు ఆచార్య సినిమా నిర్మాత కమ్ జగన్ కేసుల లాయర్ కూడా అయిన నిరంజన్ రెడ్డిని వెంటబెట్టుకుని వచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వారికి ఉన్న పరస్పర సంబంధాలతోనే చిరంజీవి ఈ భేటీకి టాలీవుడ్ తరఫున వచ్చారని రఘురామ పేర్కొన్నారు. జగన్ వారం వారం కోర్టుకు రాకపోయినా నిరంజన్ రెడ్డి సాయంతోనే తప్పించుకుంటున్నట్లు కూడా రఘురామ తెలిపారు.
కాబట్టి ఆచార్య సినిమా నిర్మాతగా కాకపోయినా జగన్ లాయర్ కోణంలో అయినా ఆయన చిరంజీవితో కలిసి సీఎం వద్దకు వెళ్లడం శుభపరిణామం అని రఘురామ అన్నారు. సినీ పరిశ్రమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకులకే ఒళ్ళు బలిసిందని ప్రజలు అనుకుంటున్నారని, ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పరిశ్రమ పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కోరారు.
17 ఏళ్లుగా తాను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాడినని.. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల అటు వైకుంఠ ఏకాదశి, ఇటు సంక్రాంతి జరుపుకో లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి విమానాశ్రయంలోకి వైసీపీ కార్యకర్తలను రానివ్వనందుకు నీటి సరఫరా నిలిపివేయడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.

చిరంజీవి-జగన్ భేటీతో అయినా సినిమా పరిశ్రమపై ప్రభుత్వం దాడులు ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు రఘురామ తెలిపారు. ఈ టాలీవుడ్ పై జరుగుతున్న దాడికి పేదలపై ఆయన కున్న ప్రేమే నిదర్శనమని జగన్ ను ఉద్దేశించి రఘురామ వ్యంగంగా వ్యాఖ్యానించారు. పేదల్ని రకరకాలుగా పన్నులు వేసి దోచుకుంటున్నప్రజలు తమ కష్టాల్ని మర్చిపోవాలంటే వారు చూసే సినిమా రేట్లను తగ్గించాలని జగన్ భావించినట్లున్నారని రఘురామ ఆరోపించారు.