సీఎం సొంత జిల్లాలో బరితెగించిన ప్రైవేట్ హాస్పెటల్స్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఏ స్థాయిలో పెరిగిపోతుందో అందరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని ఆసుపత్రులు అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్స్ దొరకని పరిస్థితిల్లో అనేక మంది రోగులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ సొంత జిల్లా లోని ప్రయివేట్ హాస్పెటల్స్ కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ బహిరంగంగా బ్యానర్ లు పెట్టి నిర్భయంగా బరితెగించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.

kadapa private hospitals

కరోనా పరిస్థితులను ఆసరాగా చేసుకొని కడప లోని ప్రయివేట్ హాస్పెటల్స్ భారీ ఎత్తున రోగుల నుండి దోచుకుంటున్నట్లు ఫిర్యాదు రావటంతో క‌డ‌ప క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ సీరియ‌స్ అయ్యారు. జాయింట్ క‌లెక్ట‌ర్ నేతృత్వంలో ఓ ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సంబంధిత ఆస్ప‌త్రుల‌తో దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫిర్యాదుల్లో వాస్త‌వం ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రూ.5 ల‌క్ష‌లు చొప్పున రెండు ఆస్ప‌త్రుల‌కు రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. అంత‌టితో ఆగ‌కుండా విజిలెన్స్ దాడుల‌ను పెంచారు.

దీంతో త‌మ దోపిడీకి ప్ర‌భుత్వం అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులంతా తిరుగుబాటు బాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు న‌గ‌రంలోని IMA హాల్లో కోవిడ్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులు స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఇక‌పై కోవిడ్ రోగుల‌ను చేర్చుకోవ‌ద్ద‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులంతా తీర్మానించారు. వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌కు కూడా దిగారు. న‌గ‌రంలోని ఆస్ప‌త్రుల ఎదుట కోవిడ్ రోగుల‌ను జాయిన్ చేసుకోవ‌డం లేద‌నే ఫ్లెక్సీలు ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. దీంతో క‌డ‌ప జిల్లాలోని కోవిడ్ రోగుల‌కు కొత్త స‌మ‌స్య‌ను ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులు సృష్టించారు. దీనితో కడప లో కరోనా రోగులు జిల్లా వదిలి వెళితే కానీ హాస్పెటల్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది.. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి రావటంతో ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..

 

Advertisement