Poonam Kaur : కాంగ్రెస్‌లో చేరనున్న టాలీవుడ్ హీరోయిన్.! లోక్‌సభకు పోటీ చేయనుందా.?

NQ Staff - October 30, 2022 / 05:15 PM IST

Poonam Kaur : కాంగ్రెస్‌లో చేరనున్న టాలీవుడ్ హీరోయిన్.! లోక్‌సభకు పోటీ చేయనుందా.?

Poonam Kaur : సినిమాల్నీ, రాజకీయాల్ని విడదీసి చూడలేం. చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో వున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా సమయం వున్నా, అప్పుడే ఎన్నికల్లో పోటీ విషయమై సినీ ప్రముఖులు తొందపడుతున్నట్లు కనిపిస్తోంది.

సినీ నటి జీవిత ఇటీవల బీజేపీలో యాక్టివ్ అవగా, దివ్య వాణి కూడా అదే బాటలో అడుగులేస్తున్నారు. కాగా, మరో సినీ నటి పూనమ్ కౌర్ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం విదితమే.

కాంగ్రెస్‌లో చేరతా.? ఎన్నికల్లో పోటీ చేస్తారా.?

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూనమ్ కౌర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో వుంటారనే ప్రచారం జరుగుతోంది.

కాగా, తొలుత ఆమె బీజేపీ వైపు వెళ్ళాలనుకున్నారనీ, కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆమె కాంగ్రెస్ వైపుకు వెళుతున్నారనీ తెలుస్తోంది. అయితే, ఈ విషయమై ఇంతవరకు పూనమ్ కౌర్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయనీ, కేవలం చేనేత కార్మికుల తరఫన వారి వాయిస్ వినిపించేందుకే ఇటీవల రాహుల్ గా దీని కలిశానని అంటున్నారు పూనమ్ కౌర్.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us