PM Modi : ప్రధాని మోడీ.. తెలంగాణలో తేడా కొడుతోంది చూడండి..

PM Modi : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఏదో తేడా కొడుతోంది. టీఆరెస్ పార్టీ సర్కారు అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇక్కడి బీజేపీ నాయకులు బహిరంగంగా చేస్తున్న విమర్శలకు అస్సలు పొంతన కుదరట్లేదు. కమలం పార్టీ లీడర్లు కేసీఆర్ సర్కార్ పై కత్తులు దూస్తుంటే క్షేత్ర స్థాయిలో దానికి భిన్నంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కాషాయం పార్టీ తెలంగాణ బాధ్యుడు బండి సంజయ్ కుమారేమో ఈ రాష్ట్రం రాక్షసుడి పాలనలో ఉందంటూ తనదైన లోకంలో ఉండిపోయి తిట్టిపోస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ అధికారులేమో ‘‘పట్టణాభివృద్ధి పథకాల అమల్లో తెలంగాణ భేష్’’ అని కితాబులిస్తున్నారు. ఈ రెండింటినీ పోల్చి చూసినప్పుడు ఏది నిజమో? ఏది అబద్ధమో? జనానికి అర్థంకావట్లేదు. ‘‘మరీ అమాయకంగా అడుగుతారేంటి? రాజకీయం అంటేనే ఇది. అసలే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతుంటే’’ అంటారా?. అయితే ఓకే.

నిజంగా నంబర్ వన్..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు మీటింగు పెట్టినా, అది పొలిటికల్ అయినా, అఫిషియల్ అయినా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ పొజిషన్ లో ఉందని అంటుంటారు. పైగా నేనేదో డబ్బా కొట్టుకోవట్లేదని, ఈ విషయాన్ని సాక్షాత్తూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరిస్తోందని పేర్కొంటూ ఉంటారు. కేసీఆర్ లైవ్ మీటింగులు చూసేవారికి ఇది సుపరిచితమే. అయితే ఆయన తరచూ వల్లెవేసే ఈ మాటలు నిజమేనంటూ తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తేల్చిచెప్పారు. పీఎం స్వనిధి (ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్ పొజిషన్ లో ఉందని ఆయన ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణకు సమీపంలో ఏ రాష్ట్రం కూడా లేదని కుండబద్ధలు కొట్టారు.

PM Modi : there is no similarity between telangana bjp firing and central governament officers comments on kcr sarkar
PM Modi : there is no similarity between telangana bjp firing and central governament officers comments on kcr sarkar

అమృతం.. అద్భుతం: PM Modi

అమృత్(అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్) పథకం పనుల్లో అద్భుతమైన పురోగతి నెలకొందని దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. నిన్న శనివారం హైదరాబాద్ కి వచ్చిన ఆయన బీఆర్కేఆర్ భవన్ లో ఆయా పథకాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రెండు స్కీమ్ లతోపాటు స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, హౌజింగ్ ఫర్ ఆల్ తదితర పథకాల పురోగతిని పరిశీలించారు. పైన చెప్పుకున్న రెండు పథకాల అమల్లో మాత్రం ‘‘ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్’’ అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు సైలెంట్ అవుతారా?. ఏమో కష్టమే. ఎందుకంటే ఇవి ఫిక్స్ డ్ పాలిటిక్స్ అంటారేమో.

నోట్: ఫొటో క్రెడిట్ టు ‘నమస్తే తెలంగాణ’

Advertisement
Advertisement