సీఎంలతో మరోసారి భేటీ కానున్న పీఎం

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేవారంలో ఏడు రాష్ట్రాలకు చెందిన సీఎంలతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలోని కరోనా పరిస్థితులపై చర్చ జరగనుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సమావేశం సెప్టెంబరు 23న జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సీఎంలు పాల్గొననున్నారని తెలుస్తోంది.

గతంలో ఆగస్టు 11వ తేదీన వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఆయా ప్రాంతాల్లోని కరోనా వైరస్ పరిస్థితులపై సమీక్షించారు. ఇక ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here