కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? : పిల్లి మాణిక్యరావు

టీడీపీ అధినేత చంద్రబాబుకు, యువనేత లోకేష్ ను టార్గెట్ చేసుకొని దారుణమైన విమర్శలు చేసిన మంత్రి కొడాలి నానికి టీడీపీ నేతలు కూడా అదే దారుణమైన భాషలో కౌంటర్లు ఇస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ కొడాలినానీ తల్లిదండ్రులకు పుట్టాడా… బూతులకు పుట్టాడా? ముఖ్యమంత్రి, మంత్రుల ఆలోచనలు జులాయి సినిమాలో బిట్టూ గ్యాంగ్ ఆలోచనల్లా ఉన్నాయంటూ నిప్పులు చెరిగాడు.

pilli manikya rao

ప్రజల దృష్టిని, వారి ఉద్యమాలను తప్పుదారి పట్టించాలనుకున్నప్పుడు బూతులమంత్రి, కళావర్ రాణి కొడాలినానీ మీడియా ముందుకొస్తాడు. ఏప్రియల్ 6, 13, 20, 27 తేదీల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభానికి సిద్ధమయ్యాడు. అదే తేదీల్లో ఆయన ఈడీ కోర్టుకి హాజరుకావాల్సి ఉంది. విశాఖ బహిరంగసభనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కొడాలినానీ, చంద్రబాబు , లోకేశ్ లపై నోరుపారేసుకున్నాడు.నానీ భాష వింటుంటే అతను తల్లిదండ్రులకే పుట్టాడా అనిపిస్తోంది. బూతులకు పుట్టాడు కాబట్టే, ఏదేదో వాగుతున్నాడు.

విజయమ్మ విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయిందో నానీ, జగన్ సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయన కోసం మరణించినవారే ఆయన నిజమైన వారసులు. తండ్రి శవపు ముద్దలను పక్కనపెట్టుకొని అధికారంకోసం బేరాలాడినవారు కాదు. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కనీసం తలనొప్పికూడా రాలేదు. చంద్రబాబు మగాడు కాబట్టే, పవిత్రురాలు, పతివ్రత అయిన లక్ష్మీపార్వతి బారినుంచి టీడీపీని కాపాడాడు. ఆనాటినుంచి ఈనాటి వరకు ఎన్టీఆర్ ఫొటోతోనే ప్రజల్లోకి వెళ్తున్నాడని పిల్లి అన్నాడు.

జగన్మోహన్ రెడ్డిలా అధికారంకోసం కోడికత్తి డ్రామాలాడి, ముద్దులుపెట్టి, అవసరం తీరాక తల్లిని, చెల్లినీ చెల్లనికాణీలుగా మార్చిన చరిత్ర చంద్రబాబుకులేదు. లోకేశ్ తో సమాజానికి, ప్రజలకుఎటువంటిహానీ లేదని బూతులమంత్రి తెలుసుకోవాలి. సమస్యంతా గన్నేరు పప్పు జగన్మోహన్ రెడ్డితోనే. లోకేశ్ గురించి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి లేఖరాస్తానంటున్న నానీ, తనపేరు ఇంగ్లీషులో రాసుకోగలడా? అంటూ విమర్శించాడు.

వైసీపీ ఎంపీలు నిజంగా మగాళ్లైతే మోదీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి. విశాఖపట్నంలో బహిరంగ సభ పూర్తయ్యేలోగా జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎంపీలు మోదీతో ప్రకటన చేయించి, వారి మగతనాన్ని నిరూపించుకోవాలి. ప్రజల్ని మెప్పించి, వారితో మెప్పించుకోవడమే నిజమైన మగతనం. కొడాలినానీలాగా బూతులు మాట్లాడేవారంతా మగాళ్లు అవ్వలేరంటూ పిల్లి మాణిక్యరావు చెలరేగిపోయాడు.

Advertisement