Kodali Nani: అంబటి, కొడాలి ల రాజకీయ పుట్టుక ఎక్కడ? వైసీపీ కత్తెరలు, బ్లేడ్లు అమ్ముకోవాల్సిందే.. పిల్లి మాణిక్యరావు

Kodali Nani తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ కు తప్పబుట్టినవాళ్లు అబద్దాల అంబోతు అంబటి రాంబాబు, పేకాట క్లబ్బు కల్వరి రాణి కొడాలి నాని. కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలపాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పెంచి, పోషించి కాపాడి, పదవులు ఇచ్చి, ప్రోత్సహించి ముఖ్యమంత్రిని చేస్తే… ఆ సీఎం పదవిని అడ్డు పెట్టుకొని, లక్షలాది కోట్లు సంపాదించి తల్లిపాలు తాగి, ఎదిగి, తల్లి రొమ్ముని కుమ్మింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసంటూ టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగాడు.

pilli manikya rao

కొడాలి నానీకి బతుకునిచ్చింది తెలుగుదేశం అని ప్రజలకి తెలుసు.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బిక్ష మీద బతికి, పదవులు అనుభవించి, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన బొత్స, ధర్మాన, పెద్దిరెడ్డి మరియు నీలాంటి వాళ్లందరూ తిన్న వాటినే తగలేసి కాలిన కట్టెలతో నిర్మించిన స్మశానసంద్రమే వైసీపీ. ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు… చంద్రబాబు పార్టీకి సారధ్యం వహిస్తున్నారు… ఇది వారసత్వమంటే. కేవలం కంటేనే వారసుడు కాలేరు. జగన్ వైఎస్ఆర్ కు దేనికి వారసుడో కుహన కాంగ్రెస్ వాదులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి.

ఎన్టీఆర్ కుమారులకు పౌరుషం ఉంది కాబట్టే తన తండ్రి స్థాపించిన పార్టీలోనే వారసులందరూ ఉన్నారు. అంబటికి, బూతుల మంత్రికి అనుమానం ఉంటే నీకు అనుమానం ఉంటే ఎన్టీఆర్ సంతానం దగ్గరికి వాళ్లండి ఎడమ చేత్తో కొడితే మీ ఇద్దరికి పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్ సీపీ అంటే ‍యడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా? లేక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనా? ధైర్యముంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రేసోడు మాకు సంబంధం లేదని అంబటి, బూతుల మంత్రి ప్రకటించాలి.

కాంగ్రెస్ నుండి పేరు మార్చుకొని ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారితో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. దానికి మీరు సిగ్గు పడాలి. రాజశేఖర్ రెడ్డి పేరు వాడకపోతే మీకు బతుకే లేదు. దమ్ముంటే మీరు వైసీపీని స్థాపించారా? లేక దొంగలించారో చెప్పాలి. మీ పార్టీ వ్యవస్థాపకుడి పేరు శివకుమార్ కాదా? మీరు వైఎస్ఆర్ సీపీని దొంగలించలేదా? మా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని మేం గర్వంగా చెబుతాం. మీ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ అని ధైర్యంగా చెప్పగలరా? అంటూ పిల్లి మాణిక్యరావు ప్రశ్నించాడు.

ప్రజల్ని మోసం చేసి గెలిచి.. అదే ప్రజలను భయభ్రాంతులను చేసి గెలిచి, పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచామని చెప్పడం కంటే మున్సిపాల్టీ మురుగులో పడి చావడం మంచిది.
విష మీడియాకు 200 కోట్ల ప్రజల సొమ్మును దోచి పెట్టి ప్రజలపై తప్పుడు వార్తల విషాన్ని చిమ్మడానికి సిగ్గుపడని సాక్షి గురించి మాట్లాడకుండా మిగతా పత్రికల గురించి మాట్లాడటం మీ పతివ్రతా శిరోమణిత్వానికి చిహ్నం. 5 సంవత్సరాల్లో లక్ష కోట్లు అప్పు తెచ్చి రాష్ట్ర రాజధానితోపాటు రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తే 132 శాతం అప్పులని తప్పు పలికారు. 21 నెలల్లో లక్షా 30 వేల కోట్లు అప్పు తెచ్చి తమ వాళ్లకి దోచిపెట్టినోడిని 34 శాతం అప్పులని సాక్షిలో చెబితే దాన్ని దేవత అంటారా? సాక్షి ఒక విష భూతం అంటూ పిల్లి మాణిక్యరావు సంచలన ఆరోపణలు చేశాడు

Advertisement