Janasena: సణుగుడు ఆపేసి… వ్యూహాలకు పదును పెట్టావయ్యా జనసేనాని

pawan kalyan went to Delhi about vizag steel company
pawan kalyan went to Delhi about vizag steel company

Janasena ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు చాలా విచిత్రంగా ఉంటుంది. పేరుకు పొత్తు అనే ట్యాగ్ తప్పితే ఎక్కడ కూడా ఉమ్మడిగా ఏమైనా కార్యక్రమాలు చేసిన ఆనవాలు లేవు, ఉమ్మడిగా ప్రకటన చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే రాజకీయవసరాల కోసం ఇద్దరు కూడా ఒకే గొడుగు కింద ఇమడక తప్పని పరిస్థితి.

pawan kalyan went to Delhi about vizag steel company

ఈ ఇద్దరి మధ్య తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ గత కొద్దీ రోజులుగా చిచ్చు పెడుతూనే ఉంది. ఆంధ్రాలో అధికారానికి కేవలం ఒకే ఒక్క ఓటు దూరంలో ఉన్నామంటూ చెప్పుకునే బీజేపీ తిరుపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దించాలని గట్టిగానే భావిస్తుంది. మరోపక్క ఈ స్థానంలో జనసేన అభ్యర్థిని దించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీ కోసం త్యాగం చేశాం , దానిని దృష్టిలో పెట్టుకొని తిరుపతి లో పోటీచేసే అవకాశం తమకే ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు.

ఇలాంటి సమయంలో ఆంధ్రాలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి, వైసీపీ, టీడీపీ సత్తా ఏమిటో పక్కన పెడితే, అసలు బీజేపీ, జనసేన సత్తా ఏమిటో అందరికి తెలిసింది. పట్టుమని పది స్థానాల్లో కూడా బీజేపీ తమ పార్టీ సానుభూతి పరులను గెలిపించలేకపోయింది. రాష్ట్ర స్థాయి నేతలుగా చెప్పుకునే అనేక మంది తమ తమ సొంత గ్రామాల్లో కూడా బీజేపీ నేతలను గెలిపించలేకపోయారు. టీడీపీ నుండి బీజేపీ లోకి వచ్చిన సీఎం రమేష్ మాత్రమే స్వగ్రామం పొట్లదుర్తిలో బీజేపీ అభ్యర్థి మంచి ఆధిక్యంతో గెలిపించుకున్నాడు.

ఇక జనసేన విషయానికి వస్తే బీజేపీ కంటే పదిరెట్లు జనసేన ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. చాలా చోట్ల జనసేన క్యాడర్ ఎన్నికల్లో గెలవటం,లేదా గట్టి పోటీ ఇవ్వటం జరిగింది. బుత్ స్థాయిలో బీజేపీ కంటే జనసేన బలంగా ఉందని ఈ పంచాయితీ ఎన్నికల్లో తేలిపోయింది. దీనిని చూపిస్తూ తిరుపతిలో పోటీచేసే తమకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ బీజేపీ మీద ఒత్తిడి తీసుకోని వస్తే అక్కడ పోటీచేసే అవకాశం వచ్చినట్లే, కానీ బీజేపీ అంత సులభంగా ఒప్పుకునే రకం కాదు, కాబట్టి ఇప్పటికైనా జనసేనాని సణుగుడు ఆపేసి, వ్యూహాత్మక రాజకీయం చేస్తేనే ఫలితం వస్తుంది, లేకపోతె త్యాగమూర్తి అనే ట్యాగ్ మాత్రమే మిగులుతుంది.

Advertisement