Pawan Kalyan: ఆ విషయంలో చంద్రబాబును మించిపోయిన పవన్ కళ్యాణ్

pawan kalyan janasena
pawan kalyan janasena

Pawan Kalyan గ్రామాల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో పార్టీలకు సంబధించిన గుర్తులు అంటూ ఏమి వుండవు, పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరిగితే గ్రామాల అభివృద్ధికి అడ్డం పడుతాయనే ఉద్దేశ్యంతో దానిని సవరణ చేయటం జరిగింది. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిచారని ఇన్ని స్థానాల్లో గెలిచారని హడవిడి చేస్తున్నారు.

janasena local body elections

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల్లో 40 శాతం పైగా విజయాలు మావే అంటూ స్టేట్మెంట్ ఇస్తూ హడావిడి చేశాడు , ఇప్పుడు ఆయన కంటే కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించిన లెక్కలు చాలా చిత్రంగా ఉన్నాయి. జనసేన పార్టీ అధికారికంగా తమ సోషల్ మీడియా పేజీ లో పంచాయితీ లెక్కలను ప్రకటించింది. సర్పంచులు 1209 చోట్ల సర్పంచు పదవులు, 1576 ఉప సర్పంచ్ , 4456 వార్డులు సాధించి మొత్తం మీద 27 శాతం, ఉభయగోదావరిలో 36 శాతం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 32శాతం ఓట్లు, మిగిలిన 65 శాతం పంచాయితీలలో ద్వితీయ స్థానం. అదేవిధంగా ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 71 శాతం పంచాయతీలలో ద్వితీయస్థానం సాధించామని చెప్పుకొచ్చింది.

ఆ లెక్కలు చూస్తుంటే చాలానే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా జనసేన కు అంత బలముందా అని అనిపిస్తుంది. 1200 చోట్ల సర్పంచు స్థానాలు అంటే మాములు విషయం కాదు. పైగా ఉభయగోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాలో సరాసరి 75 % పంచాయితీల్లో ద్వితీయ స్థానం అంటే అసలు ఊహించలేని విషయం. మిగిలిన జిల్లాలో 65 % ద్వితీయ స్థానమని ప్రకటించాడు. ఈ లెక్కలు చూస్తే ఒక రకంగా చంద్రబాబు నాయుడే నయం అనిపిస్తుంది. టీడీపీకి ఉన్న బలం ప్రకారం చూసుకుంటే అవి కొంచం నమ్మే విధంగా ఉన్నాయి, కానీ జనసేన లెక్కలు చూస్తే ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు.. సరేలే జెండా లేకుండా జరుగుతున్నా ఎన్నికలు కదా ఎన్నైనా చెపుతారు.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుస్తుంది.. ఎవరి సత్తా ఏమిటో..

Advertisement