Pawan Kalyan : తాము అధికారంలోకి వస్తే ఇప్పటంలో జరిగిందే అంతటా జరగడం ఖాయం : పవన్
NQ Staff - November 27, 2022 / 07:20 PM IST

Pawan Kalyan : జనసేన ని పవన్ కళ్యాణ్ మరో సారి ఇప్పటం గ్రామం లో పర్యటించారు. గ్రామంలో ఇల్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయల తక్షణ సహాయం అందించేందుకు గాను పవన్ కళ్యాణ్ మరో మారు ఇప్పటం గ్రామానికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకుల యొక్క ఇళ్లను లీగల్ గా ఇప్పటంలో ఎలా అయితే కూల్చివేశారో అలాగే కూల్చి వేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
వైకాపా ఎమ్మెల్యేలు ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యేలు అవుతారు, కనుక వారందరి ఇల్లు కూడా తమ గవర్నమెంటు నేల మట్టం చేయడం ఖాయం అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
జనసేనకు మద్దతు తెలిపిన వారందరిపై కూడా వైకాపా ప్రభుత్వం కక్ష సాధిస్తుంది.. కనుక తాము అధికారంలోకి వస్తే వైకాపా మద్దతుదారులకు చుక్కలు చూపిస్తామన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు.