వైఎస్ జగన్ కి ఎవ్వరూ చేయలేని ఫేవర్ చేసిన పవన్ కల్యాణ్ ??

Mamatha 600 - December 22, 2020 / 05:20 PM IST

వైఎస్ జగన్ కి ఎవ్వరూ చేయలేని ఫేవర్ చేసిన పవన్ కల్యాణ్ ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఎన్నికలు రాబోతున్నాయి. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణం చెందడం తో తిరుపతిలో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఉప ఎన్నికలు అతి త్వరలోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ పార్టీలు సిద్ధమయ్యాయి. వైసీపీ పార్టీ అధికారంలో ఉండటంతో పాటు తిరుపతిలో కేడర్ కూడా బలంగానే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా.. వైవీపీ పార్టీ గెలవ గలదు.

Pawan vs Jagan

అయితే టిడిపి కూడా తిరుపతి లో బలమైన పార్టీగానే కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలను అమలు పరిస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే జగన్ టిడిపి పార్టీ ని సీరియస్ గా తీసుకుని ముందడుగు వేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకి తెలియకుండానే వైసీపీ సర్కార్ కి మేలు చేయబోతున్నారు. అదేంటి అని అడిగితే.. తిరుపతి ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని దించాలని పవన్ భావిస్తున్నారు. బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే బిజెపి మాత్రం జనసేన పార్టీని ఎన్నికల బరి నుంచి వైదొలగాలని పవన్ కి చెబుతోంది. పవన్ మాత్రం తనకు తిరుపతి లో ఓటు బ్యాంకు ఉందని.. బీజేపీ పార్టీ కంటే జనసేన పార్టీని బలంగా ఉందని చెబుతూ తమ అభ్యర్థిని నిలబెడతామని అంటున్నారు.

ఒకవేళ జనసేన పార్టీ తమ అభ్యర్థిని నిలబెడితే కాపు వర్గం ఓట్లు జనసేన కి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని నిలబెడితే కాపు ఓట్లు వైసీపీకి లేదా టిడిపికి రావచ్చు. బీజేపీ నిలబడితే టిడిపి పార్టీకి ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంటాయి కానీ జనసేన పార్టీ అభ్యర్థి నిలబడితే టిడిపి పార్టీ ఓట్లు తగ్గిపోతాయి. ఫలితంగా వైసీపీ కి అసలైన ప్రత్యర్థి అయిన టిడిపి పార్టీ కి తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే జగన్ కి ఎవరూ చేయలేని ఫీవర్ ని పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us