padmanabham: మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీసారు.. ముద్ర‌గ‌డ కామెంట్స్‌

padmanabham: అసెంబ్లీలో జ‌రిగిన పరిణామాల‌కు చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిలుస్తుంటే మ‌రి కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టీవీలో చూసి ఆశ్చర్యపోయాను.

padmanabham-writes-letter-chandrababu-naidu1
padmanabham-writes-letter-chandrababu-naidu1

మా జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాల అవమాన పరిచారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను.. నా భార్యను ఏ కారణంతో బంధించారు.

మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారు. మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా?. నా కుటుంబాన్ని అవమానపరచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నా.

నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాధను చేశారు. శపధాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి’ అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.

padmanabham-writes-letter-chandrababu-naidu
padmanabham-writes-letter-chandrababu-naidu

శపథాలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతం. చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం
నీటిమీద రాత అని గ్రహించాలి. జీవితాలు, ఆస్తుల, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు.