TDP: టీడీపీ అధ్యక్షుడి జిల్లాలో పార్టీకి దారుణమైన షాక్

PBN - March 1, 2021 / 11:02 AM IST

TDP: టీడీపీ అధ్యక్షుడి జిల్లాలో పార్టీకి దారుణమైన షాక్

TDP ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఏమిటో కొత్తగా చెప్పే పనిలేదు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ కోలుకోవడానికి కింద మీద పడుతుంది. పార్టీ కొంచం పుంజుకుంది అనే సమయంలో సీఎం జగన్ ఎత్తుగడలు వేస్తూ టీడీపీని పైకి రాకుండా చూస్తున్నాడు. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గతంలో కంటే కొన్ని చోట్ల టీడీపీ మంచి ఫలితాలు రాబట్టింది అనే టాక్ వినిపిస్తున్న తరుణంలో అలాంటి వాటికీ చెక్ పెట్టె విధంగా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసింది.

tdp president chandrababu to suspend tdp senior leaders from party

ముఖ్యంగా టీడీపీకి ఎక్కడెక్కడ పట్టు ఉందొ మొన్నటి పంచాయితీ ఎన్నికలో తెలిసిపోయింది. ఇప్పుడు వాటిని టార్గెట్ చేస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికల సమయానికి అక్కడ టీడీపీ క్యాడర్ ను లాగేసుకునే పనిలో పడింది వైసీపీ పార్టీ. అదే విధంగా టీడీపీ అగ్రనేతల సొంత జిల్లాల్లో కూడా వైసీపీ బలపడటానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చింది.

అచ్చెన్ననాయుడుకు అధ్యక్ష పదవి ఇస్తే ఉత్తరాంధ్రలో టీడీపీ పుంజుకుంటుంది అనే ఆలోచనతో బాబు ఆ పదవి అచ్చెన్నాకు కట్టబెట్టాడు, అయితే దానికి విరుద్ధంగా అక్కడి పరిణామాలు మారిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోట లాంటి శ్రీకాకుళంలో ఫలితాలు తేడా కొట్టాయి. ఇక అక్కడితో అది ఆగేలా కనిపించడంలేదు. ఇపుడు మునిసిపాలిటీల్లోనూ సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది.ఏకంగా నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులు సడెన్ గా వైసీపీ జెండా కప్పుకోవడం ద్వారా పలాసా టీడీపీని పరేషాన్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కండువాలు మార్చడం పాత ట్రెండ్ అయితే ఇపుడు ఏకంగా అభ్యర్ధులే మూకుమ్మడిగా పార్టీ మారడం నయా ట్రెండ్.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సొంత జిల్లాలోనే పార్టీకి ఇలాంటి దారుణమైన పరిస్థితి రావటం తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక అచ్చెన్న అయితే ఈ షాక్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అయితే ఇది దారుణం అన్యాయం అంటున్నారు. ఎవరెన్ని మొత్తుకున్నా ఇది రాజకీయం.. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే వలసలను ప్రోత్సహించి వైసీపీని బలహీనం చేయాలనీ చూసింది. ఇప్పుడు ఆ పాత్ర వైసీపీ పోషిస్తుంది.. అంతే తేడా

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us