YCP : వైసీపీలో ఏం జరుగుతోందో మంత్రులకీ తెలియదేమో.!

NQ Staff - July 8, 2022 / 04:02 PM IST

YCP : వైసీపీలో ఏం జరుగుతోందో మంత్రులకీ తెలియదేమో.!

YCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేశారు. ఈ విషయం వైసీపీ నేతల కంటే ముందు టీడీపీ అనుకూల మీడియాకి తెలిసింది. టీడీపీ అనుకూల మీడియా అని చెప్పబడే ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని తొలుత బ్రేక్ చేసింది.

Only Pro TDP Media can Imagine what Happen in YCP

Only Pro TDP Media can Imagine what Happen in YCP

వాస్తవానికి, వైఎస్ షర్మిల అలాగే వైఎస్ విజయమ్మకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్‌లు అన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచే బయటకు వస్తున్నాయి. వైఎస్ షర్మిల పార్టీ వ్యవహారం కూడా తొలుత ఏబీఎన్ ద్వారానే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
పచ్చ మీడియా అన్నారు.! ఇప్పుడేమంటారు.?

పచ్చ మీడియా, దుష్ట చతుష్టయం.. అంటూ పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ మీదా, టీడీపీ అనుకూల మీడియా మీదా విమర్శలు చేస్తుంటారు. మరి, ఆ పచ్చ మీడియా చెప్పిందే నిజమైంది కదా.? విజయమ్మ వైసీపీకి రాజీనామా చేయడం, అదీ ప్లీనరీ వేదికగా జరగడం.. ఇదంతా ఏబీఎన్ ముందే ఎలా ఊహించగలిగింది.?

చిత్రమేంటంటే, వైసీపీ కీలక నేతలు.. అందునా మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి నేతలు, ‘అబ్బే, అదేం లేదు.. ఆమె పార్టీని వీడరు.. ఆమె రాజీనామా చేయరు..’ అని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా విజయమ్మ విషయంలో మీడియాపై గుస్సా అయ్యారు.

కానీ, చివరికి జరిగిందేంటి.? వైసీపీలో ఏం జరగబోతోందో టీడీపీ అనుకూల మీడియానే ఊహించగలుగుతోంది. ఆ మీడియాకే సమాచారం అందుతోంది. కానీ, వైసీపీ నేతలకే పార్టీలో ఏం జరుగుతోందో తెలియడంలేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us