NTR: అరాచ‌క సంస్కృతిని ఆపేయండి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాడండి అంటూ ఎన్టీఆర్ విన్న‌పం

NTR: 40 ఏళ్ల రాజకీయ ఉద్దండుడు చంద్ర‌బాబు .. వైసీపీ నాయ‌కుల కామెంట్స్ వ‌ల‌న నిబ్బరం కోల్పోయి చిన్నపిల్లాడిలా ఏడవడం ఊహించని పరిణామమే. రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్లపై వ్యక్తిగత దూషణలు చేయడం ఏమిటని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ లీడర్ పురంధేశ్వరి తో పాటు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు

TheNewsQube-
ntr responce on chandrababu issue
ntr responce on chandrababu issue

అయితే చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ ని జూనియర్ ఎన్టీఆర్ ని కార్నర్ చేయడానికి టీడీపీలోని ఆయన యాంటీ ఫ్యాన్స్ వాడుకుంటున్నారు. ఈ సంఘటన వాడుకొని ఆయనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జూనియర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియో షేర్ చేశారు.

అంద‌రికి న‌మ‌స్కారం. మాట మ‌న వ్య‌క్తిత్వానికి ప్ర‌మాణం. రాజ‌కీయాల‌లో విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధార‌ణం. ఇవి ప్ర‌జా స‌మ‌స్య‌ల మ‌ధ్య జ‌రిగాల‌నే కాని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లుగా ఉండ‌కూడ‌దు. నిన్న అసెంబ్లీలో జ‌రిగిన‌టువంటి సంఘ‌ట‌న నా మ‌న‌సుని క‌లిచి వేసింది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నామో, ఆడవారిపై పురుష ప‌ద‌జాలంతో మాట్లాడుతున్నాయో అది అరాచ‌క‌పాల‌న‌కు నాంది.

ఇది త‌ప్పు. స్త్రీ జాతిని గౌర‌వించ‌డం అనేది మ‌న సంస్కృతి. మ‌న న‌వ నాడుల్లో, జవ జీవాల్లో, మ‌న ర‌క్తంలో ఇమిడిపోయ‌న సంప్ర‌దాయం. మ‌న సంప్రదాయాల‌ను రాబోయే త‌రాల‌కు భ‌ద్రంగా అప్ప‌జెప్పాలే కాని మ‌న సంస్కృతిని క‌లిచి వేసి కాల్చేస్తున్నరు. రాబోయే త‌రానికి ఓ బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే ఇలా చేయ‌డం త‌ప్పు. ఈ మాట‌లు నేను ఇలాంటి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు గురైన‌టువంటి కుటుంబ స‌భ్యుడిగా మాట్లాడ‌డం లేదు.

కొడుకుగా, తండ్రిగా, భ‌ర్ల‌గా, దేశానికి పౌరుడిగా, సాటి తెలుగ‌వాడిగా మాట్లాడుతున్నాను. ఈ అరాచ‌క సంస్కృతికి ఇక ఆపండి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడండి. రాబోయే త‌రానికి బంగారు బాట వేసేలా చూడండి. ఇది ఇక్క‌డితో ఆగిపోతుందని నేను విశ్వ‌సిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ తెలిపారు.