NTR : జూనియర్ ఎన్టీయార్ ‘ఫుట్’.! నారా డాగ్స్.! అసలేమైంది.?
NQ Staff - September 24, 2022 / 09:00 AM IST

NTR : అత్యంత జుగుప్సాకరమైన రీతిలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న విషయం విదితమే. స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించి, వైఎస్సార్ పేరుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టడంతో, దానిపై జూనియర్ ఎన్టీయార్ స్పందించాడు.

NTR Foot Nara Dogs TDP Trending Andhra Pradesh Politics
ఆ స్పందన ఇటు టీడీపీకీ నచ్చలేదు, అటు వైసీపీకి కూడా నచ్చలేదు. ఎవరినీ నొప్పించని స్థాయిలో జూనియర్ ఎన్టీయార్ ట్వీట్ వుండడం కాస్త, ఇరువురికీ ఆగ్రహం తెప్పించినట్లుంది. కారణమేదైతేనేం, ఓ సినీ నటుడిగా జూనియర్ ఎన్టీయార్ ఏం చేయాలో అదే చేశాడు. రాజకీయాల్లో వేలు పెట్టకూడదనుకున్నాడు, తన తాత ఎన్టీయార్ విషయమై స్పందించాల్సిన రీతిలో స్పందించాడు.
నారా డాగ్స్.. అసలేంటీ వైపరీత్యం.? జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ ట్రోలింగ్ నేపథ్యంలో, జూనియర్ ఎన్టీయార్ అభిమానులూ ధీటుగానే స్పందించాల్సి వస్తోంది. ‘జూనియర్ ఎన్టీయార్ ఫుట్.. నారా డాగ్స్..’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీయార్ చాలా చాలా కష్టపడిన విషయాన్ని ఆయన అభిమానులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుకీ, నారా లోకేష్‌కీ టీడీపీలో చాలామంది నేతలకు ఆ విశ్వాసం లేకుండా పోయిందన్నది జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ఆరోపణ. ఇప్పుడు జరుగుతున్న తతంగం చూస్తోంటే, టీడీపీకి పూర్తిగా ఎన్టీయార్ దూరమైనట్లే భావించాలి.