NTR : కట్టె కాలే వరకూ తెలుగుదేశం పార్టీతోనే: జూనియర్ ఎన్టీయార్.!

NQ Staff - September 23, 2022 / 08:29 AM IST

160212NTR : కట్టె కాలే వరకూ తెలుగుదేశం పార్టీతోనే: జూనియర్ ఎన్టీయార్.!

NTR : యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు తన తాత స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశం వుందా.? పనిగట్టుకుని టీడీపీ నేతలు కొందరు, జూనియర్ ఎన్టీయార్ మీద బురద చల్లడం తప్ప, చిన్న ఎన్టీయార్ ఎందుకు పెద్ద ఎన్టీయార్ స్థాపించిన పార్టీకి దూరమవుతాడు.? సినిమాల్లో బిజీగా వుండడం వల్ల తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీయార్ జోక్యం చేసుకోలేకపోతున్నాడు. పైగా, జూనియర్ ఎన్టీయార్‌ని దూరం పెట్టేందుకు చంద్రబాబు ప్రతిసారీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.

NTR Fans Trending his Old Video for Support TDP

NTR Fans Trending his Old Video for Support TDP

జూనియర్ ఎన్టీయార్ గనుక టీడీపీలోకి వస్తే, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని చంద్రబాబుకి బాగా తెలుసు.
వీడియో వైరల్.. కానీ, పాతది.. ‘నా కట్టె కాలేవరకు తెలుగుదేశం పార్టీతోనే వుంటాను. నా అవసరం ఎప్పుడు టీడీపీకి వచ్చినా, ఆ పార్టీ వెంట వుంటాను..’ అని యంగ్ టైగర్ ఎన్టీయార్ కొన్నాళ్ళ క్రితం మీడియా సమావేశంలో కుండబద్దలుగొట్టేశాడు.

ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీయార్‌ని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్న దరిమిలా, ఆ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ఈ వీడియోని ప్రచారంలోకి తెచ్చారు. ‘మీరు ఆయన్ని దూరం పెడుతున్నారు. ఆయనెప్పుడూ తెలుగగుదేశం పార్టీతోనే వుంటారు. టీడీపీని మీరే నాశనం చేసుకుంటున్నారు..’ అంటూ చంద్రబాబుకీ, లోకేష్‌కీ, బాలకృష్ణకీ కూడా ఈ వీడియోని ట్యాగ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.