NTR : సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులు

NQ Staff - September 23, 2022 / 02:48 PM IST

160287NTR : సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులు

NTR : ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై నందమూరి ఫ్యామిలీ భగ్గుమంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నాయకులు వైకాపా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించి రాజశేఖర్ రెడ్డి పేరును ఎలా పెడతారు అంటూ మండిపడుతున్నారు.

NTR Fans Only Senior NTR Fans TDP Leaders Target

NTR Fans Only Senior NTR Fans TDP Leaders Target

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి యొక్క గౌరవార్థం పెట్టిన పేరును తొలగించడం దారుణం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మార్పిడి విషయమై స్పందించారు.

ఎన్టీఆర్ పేరును తొలగించినంత మాత్రాన ఆయన కీర్తి తగ్గించబడదు అంటూ కాస్త మెత్తగానే మాట్లాడడం జరిగింది. సున్నితంగా జగన్ మోహన్ రెడ్డి తీరుని విమర్శించాడు, కానీ తెలుగు దేశం పార్టీ నాయకులకు అది సరిపోవడం లేదు.బాహాటంగా.. డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానులు అయ్యారు.

ఇప్పుడు ఈయనకు కొత్తగా ఎవరు అభిమానులు పుట్టుక రాలేదు, అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గారికి అవమానం జరిగితే స్పందించాల్సిన అవసరం లేదా అంటూ జూనియర్ ఎన్టీఆర్ తీరుని తప్పుపడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ కార్నర్ అయ్యాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ లా కాకుండా పొడి పొడిగా స్పందించడం పట్ల దుమారం రేగుతోంది. ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి.