ఈటెల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. ట్రీట్మెంట్ మాత్రం పాతదే

తెలంగాణలో ఒక పక్క ఎన్నికల ఫలితాల హడావిడి జరుగుతుంటే మరోపక్క తెరాస మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల విచారణ శరవేగంగా జరుగుతుంద. తన వ్యాపారాల కోసం దాదాపు 100 ఎకరాలు అసైన్డ్ భూములను పేద ప్రజలను భయపెట్టి లాక్కున్నారనే విమర్శలు ఎదుర్కుంటున్న ఈటెలను సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తొలిగించిన విషయం తెలిసిందే, అదే సమయం సీఎం “ప్రత్యకమైన” శ్రద్ద తీసుకోని మరి ఈటెల మీద విచారణను ముమ్మరం చేపిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

etela rajednar

ఈ వ్యవహారంలో చిన్న ట్విస్ట్ ఒకటి జరిగింది. అదేమిటంటే మొదట ఈటెల 100 ఎకరాలు కబ్జా చేసినట్లు వార్తలు వచ్చాయి, అయితే ఇప్పుడు విచారణ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ కేవలం 66 ఎకరాలు కబ్జా కబ్జాకు గురైందని గుర్తించి దానికి సంబంధించిన రిపోర్ట్ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కు అందించినట్లు తెలుస్తుంది.

నిన్న అచ్చంపేట, హకీంపేటలో క్షేత్రస్థాయిలో పర్యటించి, భూముల్ని పరిశీలించిన కలెక్టర్.. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ సంస్థ ఎలాంటి నిబంధనలు పాటించలేదని, అస్సైన్డ్ భూముల్లో చెట్లను కూడా నరికేశారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఆక్రమణ జరిగిన మాట వాస్తవమని ప్రకటించారు. ఈ మేరకు ఆ భూములకు సంబంధించిన బాధితుల్ని కలిశారు. వాళ్ల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అస్సైన్డ్ భూములను కలిగి ఉన్న వ్యక్తుల్ని బెదిరింది, అన్యాయంగా ఈటల, వాళ్ల నుంచి భూములు లాక్కున్నారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు.

100 కావచ్చు 66 ఎకరాలు కావచ్చు, ఇందులో అంకె ఒకటే మారింది కానీ, ట్రీట్మెంట్ మాత్రం మారలేదు. మరోపక్క ఈటెల రాజేందర్ మాత్రం నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు, అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, అందుకు నేను సిద్దమే అని ప్రకటించాడు.శాఖ లేకుండా మంత్రిగా ఉంటున్న ఈటెలను రాష్ట్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటెలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చారు. దీనితో రాబోయే రెండు మూడు రోజుల్లో తెరాస పార్టీకి ఈటెల రాజేందర్ రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి

Advertisement