లోకేష్ కు ఉన్న ఆ దైర్యం, చంద్రబాబుకు లేకుండా పోయింది. అవాక్కవుతున్న టిడిపి శ్రేణులు.

Admin - October 23, 2020 / 03:57 PM IST

లోకేష్ కు ఉన్న ఆ దైర్యం, చంద్రబాబుకు లేకుండా పోయింది. అవాక్కవుతున్న టిడిపి శ్రేణులు.

ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది. ఇక అప్పటి నుండి పార్టీకి అనేక సమస్యలు ఒకదాని వెనుక మరొకటి వెంబడిస్తున్నాయి. అయితే చాలా వరకు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ లో చేరారు. దీనితో చంద్రబాబుకు షాక్ ల మీద షాకులు తగిలాయి. ఇక ఇది ఇలా ఉంటె ఎన్నో ఏళ్లుగా టిడిపిని తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. దాదాపు 25 ఏళ్లుగా పార్టీని పెద్ద స్థాయిలో నడిపించాడు. అయితే చంద్రబాబుకు వయసు మీద పడుతుండడంతో, పార్టీ బాధ్యతలు పార్టీలో కీలకంగా ఉన్నవారికి అప్పజెప్పాలి అని ఆలోచనలో ఉన్నారు.

ఇక పార్టీలో కీలకం అంటే చంద్రబాబు తరువాత స్థాయిలో ఉన్నది తన తనయుడు లోకేష్ బాబే అని చెప్పాలి. ఇక త్వరలో లోకేష్ బాబును బరిలోకి దింపి కీలక బాధ్యతలు ఇవ్వాలని బాబు ఆలోచనల్లో ఉన్నారు. అయితే టిడిపి పార్టీని స్థాపించిన నటసామ్రాట్ నందమూరి తారక రామారావు కొన్ని ఏళ్ళు అధ్యక్షులుగా నడిపించారు. ఇక ఆ తరువాత చంద్రబాబు కీలకంగా పార్టీ పగ్గాలు చేపట్టాడు. ఇక ఇప్పుడు లోకేష్ బాబుకు బాధ్యతలు కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నాడు.

అయితే మొన్న కరోనా రోజుల్లో చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటె, పార్టీలో చినబాబే కీలకంగా పాత్ర పోషించాడు. దీనితో ఆ పార్టీ నాయకులూ కూడా లోకేష్ నాయకత్వంపై అనుకూలంగానే ఉన్నారని తెలుస్తుంది. ఇక చినబాబుకు పార్టీ వ్యవహారాలు ఇస్తే పార్టీ దూసుకుపోతుందని భావిస్తున్నారు. ఇక కొందరు అయితే చంద్రబాబు కంటే చినబాబు గారే బెటర్ అని అంటున్నారు. ఇక చినబాబు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. చంద్రబాబు కంటే మెరుగ్గా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు అవాక్కవుతున్నరట.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us