Nara Chandrababu Naidu : జగన్ అరాచకానికి నిదర్శనం అమర్ నాథ్ మరణం.. చంద్రబాబు ఫైర్..!
NQ Staff - June 20, 2023 / 09:01 AM IST

Nara Chandrababu Naidu : బాపట్ల జిల్లాకు చెందిన అమర్ నాథ్ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అమర్ నాథ్ పదో తరగతి చదువుతున్నాడు. ఆయన అక్క హేహ శ్రీని వెంకటేశ్వర్(21) అనే యువకుడు కొంత కాలంగా వేధిస్తున్నాడు. అతన్ని అమర్ నాథ్ నిలదీయడంతో కక్ష పెట్టుకుని అమర్ నాథ్ ను చంపేశాడు వెంకటేశ్వర్.
అయితే ఈ ఘటనపై మొదటి నుంచి టీడీపీ పార్టీ పోరాడుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమర్ నాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా మృతిని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి పెరిగిపోతోంది. కానీ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇంత పెద్ద హత్య జరిగితే ముఖ్యమంత్రి ఇక్కడకు రాలేదు. మేం వచ్చి పోరాడతే శవ రాజకీయాలు అంటారు. ఇది శవరాజకీయమా. అక్కను వేధిస్తే తమ్ముడు ప్రశ్నించకూడదా..

Nara Chandrababu Naidu Visited Amarnath Family
రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అర్థం కావట్లేదు. ఇది జగన్ అరాచక పాలనకు నిదర్శనం. టీడీపీ నేతలు రాకపోయి ఉంటే బాధితులపైనే కేసు పెట్టాలని చూశారు. ఇదంతా వైసీపీ కార్యకర్తలు చేసిన ఘోరం. ఆ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం.

Nara Chandrababu Naidu Visited Amarnath Family
హేహ శ్రీని ఎన్టీఆర్ ట్రస్టు తరఫున దత్తత తీసుకుంటున్నా. ఆమె ఎంత వరకు చదువుకున్నా సరే నేను చదివిస్తాను. ఆమె ఉన్నత స్థాయికి వెళ్లి ఇలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో లెక్కలేనన్ని కుటుంబాలు జగన్ రెడ్డి మనుషుల వేధింపులను భరిస్తున్నాయి. మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లు నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. వారందరికీ నేను సంఘీభావం తెలుపుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు.
Amarnath's family is devastated. I can't imagine the mother's grief. Her son, a class 10 student, the hope of the family, was burnt alive by YSRCP's men for fighting against their harassment of his sister.
Words cannot describe my anguish. We shall provide all possible… pic.twitter.com/Eiz0OsG4b9
— N Chandrababu Naidu (@ncbn) June 19, 2023