Nadendla manohar: ఆర్టీసీ టిక్కెట్ రేట్స్ త‌గ్గించే ద‌మ్ముందా అంటూ నాందెడ్ల మ‌నోహ‌ర్ సూటి ప్ర‌శ్న‌

Nadendla manohar: ఏపీలో సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీ మంత్రులు త‌మ త‌ప్పును క‌వ‌ర్ చేసుకుంటున్న‌ప్ప‌టికీ ప‌లువురు వారి త‌ప్పును ఎత్తి చూపుతున్నారు. తాజాగా సీన్లోకి సంచలనాల దర్శకుడు రామ్ గోపార్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఏపీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

nadendla manohar fires on jagan
nadendla manohar fires on jagan

ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమావాళ్లు ఏ విధంగా నష్టపోతారో పంచ్ లతో వివరించారు. పేదవాడి కోసమని చెబుతున్న ప్రభుత్వం.. కొందరు మంత్రులు కలిసి తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి పేదలకు ఉచితంగా సినిమా చూపించాలంటూ వ్యంగాస్రాలు విసిరాడు.

ఇక తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సొంత రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ఏపీలోని ప్రజలు పలు ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నారని.. అలాంటి వారు సంక్రాంతి పండక్కి ఆర్టీసీ బస్సుల్లో రావాలంటే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

nadendla manohar fires on jagan
nadendla manohar fires on jagan

వారు ప్రయాణించే బస్సుల్లో టిక్కెట్ ధరలను ఇష్టం వచ్చినట్లు 50 శాతం పెంచేశారని… సామాన్యుల కోసం ఆర్టీసీ టిక్కెట్ ధరలను తగ్గించే దమ్ము జగన్‌కు ఉందా అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడిపోతుంటే అవి పట్టించుకోవడం మానేసి… సినిమా టిక్కెట్ ధరలను తగ్గించడమేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.